కశ్మీర్‌లో రేపటి నుండి సాధరణ పరిస్థితులు.. విద్యాలయాలు ఓపెన్, ఉద్యోగులు విధుల్లోకి హజరు కావాలి

కశ్మీర్‌లో ఆర్టికల్ రద్దు, విభజన తర్వాత నెలకొన్న పరిస్థితుల నుండి ప్రజలను త్వరగా బయటపడేందుకు కేంద్రం చకచక పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే కశ్మీర్‌లో ఎక్కువ రోజులు నిర్భంధం కొనసాగించకుండా సాధరణ జనజీవనాన్ని కొనసాగించేందుకు చర్యలు చేపట్టింది. గత రెండు రోజులుగా కొనసాగుతున్న భద్రతా చర్యలను సడలించింది. దీంతోపాటు కేంద్ర,రాష్ట్ర ఉద్యోగులు విధులకు హజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో వెంటనే హజరు కావాలి.

ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో వెంటనే హజరు కావాలి.

ఇందులో భాగంగా శుక్రవారం నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. దీంతో ఆయా స్థాయిల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు,సెక్రటేరిట్‌తోపాటు ,జిల్లా స్థాయిల్లోపని చేసే ఉద్యోగులు తక్షణమే విధుల్లో చేరాలని జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలను జారీ చేశారు.. దీంతో పాటు విద్యాలయాలను కూడ రీ ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా గవర్నర్ సత్యపాల్ మాలిక్ శాంతి భద్రత పరిస్థితులపై సమీక్ష చేసిన అనంతరం ప్రభుత్వ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.

రెండు రోజులుగా అంతా ప్రశాంతం..

రెండు రోజులుగా అంతా ప్రశాంతం..


కాగా జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్గిస్తున్న ఆర్టికల్ 370,35ఏలను రద్దు చేయడంతోపాటు కశ్మీర్ విభజించడంతో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తలు చేపట్టింది. కశ్మీర్ పరిణామాల్లో ఎక్కడ ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున భద్రతా దళాలను పంపించిన అనంతరం అక్కడి విద్యాలయాలను, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. కాగా రెండు రోజుల నుండి జనజీవనం స్థంభించింది. కాగా రెండు రోజులుగా బంద్ వాతవరణం కొనసాగిన నేపథ్యంలోనే ఎలాంటీ అసాంఘీక చర్యలకు అవకాశం ఇవ్వలేదు.

 జమ్ము కశ్మీర్‌కు భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించనున్న మోడీ

జమ్ము కశ్మీర్‌కు భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించనున్న మోడీ

మరోవైపు కశ్మీర్ అంశంపై ప్రధానమంత్రి నేరుగా రంగంలోకి దిగారు. ఆయన చాల రోజుల తర్వాత జాతిని ఉద్దేశించి మాట్లాడేందుకు సిద్దమయ్యారు. ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దుతోపాటు కేంద్రపాలిత ప్రాంత్రాలుగా ప్రకటించడంతో ప్రజల్లో పలు అనుమానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో వాటికి మోడీ సమాధానం చెప్పనుండడంతోపాటు లద్దాఖ్, కశ్మీర్ ప్రాంతాలకు భారీ ఎత్తున నిధులు,అభివృద్ది ప్రణాళికలు ప్రకటిస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. నిధులతో జమ్ము కశ్మీర్‌లో కొంతమేరకు శాంతి వాతవరణం నెలకోనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+