• search

కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు: నోరు జారాడు.. మంత్రి పదవి ఊడింది!

By Ramesh Babu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  శ్రీనగర్: కశ్మీర్ వివాదం రాజకీయాంశం కాదంటూ ఓ మంత్రి వ్యాఖ్యలు చేయడంతో ఆయన మంత్రిపదవి కాస్తా ఊడిపోయింది. కశ్మీర్ ఆర్థికశాఖ మంత్రి డాక్టర్ హసీబ్ డ్రబు.. మార్చి 9న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో పాల్గొన్నారు.

  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నాకు తెలిసినంత వరకు జమ్మూకశ్మీర్ రాజకీయ అంశం కాదు. కానీ, దీనిని గత 70 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నారని' వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.

  J&K Minister Haseeb Drabu, Who Said Kashmir "Not A Political Issue", Sacked

  జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఢిల్లీ నుంచి తిరిగి రాగానే గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు లేఖ రాస్తూ, మంత్రివర్గం నుంచి డ్రబును తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె లేఖకు స్పందించిన గవర్నర్ ముఫ్తీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపారు.

  డ్రబు వ్యాఖ్యలపై స్వపక్షం పీడీపీతోపాటు విపక్షాలు, వేర్పాటువాదులు, వాణిజ్య వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా పీడీపీ ఉపాధ్యక్షుడు సర్తాజ్ మద్ని డ్రబును ఆదేశించారు. అనంతరం కేబినెట్ నుంచి ఆయనను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

  మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై పీడీపీ నిష్టనివారణ చర్యలు ప్రారంభించింది. కశ్మీర్ అంశాన్ని తాము రాజకీయ సమస్యగానే పరిగణనిస్తామని, అంతర్గత, బాహ్య సయోధ్య కోసం చర్చలు ద్వారా పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని ఆదివారం ప్రకటించింది.

  విచిత్రమేమిటంటే.. పీడీపీ- బీజేపీ కూటమి ఏర్పాటులో డాక్టర్ హసీబ్ డబ్రుయే కీలక పాత్ర పోషించారు. కూటమి ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన పదవి పోగొట్టుకున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Haseeb Drabu, the finance minister of Jammu and Kashmir, has been sacked over a controversial comment that Kashmir is "not a political issue", say sources. Sources in the state's ruling People's Democratic Party (PDP) had reportedly asked him to explain his comments yesterday and retract them. Haseeb Drabu, an economist, is known to have been pivotal in the crafting of a common agenda for the PDP-BJP alliance in the state. This is what he said at an event in Delhi on Friday: "Those who see Jammu and Kashmir as a conflict state, as a political issue ...it's a society which has social issues right now...It's not a political issue as far as I can see, I think we are barking at the wrong tree for the last 57 years by talking about the politics of it, that the political situation has never improved. We seriously need to look at in terms of how it is a society that is in search for itself."

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more