చొరబాటుకు యత్నం: ఆరుగురు ఉగ్రవాదుల కాల్చివేత
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు సమర్థంగా తిప్పికొట్టాయి. కుప్వారా, కెరన్ సెక్టార్లలో చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే వారిపై కాల్పులు జరిపాయి.
ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. మరికొంత మంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టాయి. జూన్ 6న కూడా కొంతమంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటేందుకు ప్రయత్నించారు.

అప్రమత్తమైన భద్రతాళాలు కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. మే 26న ఐదుగురు మిలిటెంట్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మే 18న ముగ్గురు మిలిటెంట్లను కాల్చిపడేశాయి.












Click it and Unblock the Notifications