వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్‌ కట్టడికి ఆంధ్రప్రదేశ్‌లో మే 5 నుంచి కొత్త ఆంక్షలు, జగన్‌ ప్రభుత్వం నిర్ణయం: News Reel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది.

కోవిడ్‌-19 నియంత్రణ చర్యలను సమీక్షించిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మే 5 (బుధవారం) నుంచి రాష్ట్రంలో కొన్ని కొత్త ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Jagan

ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని షాపులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే తెరిచి ఉంచాలి.

ఆ తర్వాత అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తారు. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకూ 144 సెక్షన్ కూడా అమలులో ఉంటుంది.

ఏపీలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది.

దేశవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 23,290 పాజిటివ్ కేసులు నమోదవగా, కోవిడ్ వల్ల 83 మంది చనిపోయారు.

తెలంగాణలో కూడా గత 24 గంటల్లో 5,695 కొత్త కేసులు నమోదయ్యాయి. 49 మంది చనిపోయారు.

రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను మే 8 వరకూ పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Jagan govt imposes new restrictions from May 5th
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X