Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జస్ట్ 25 రూపాయలతో దేశం మొత్తం రైలు ప్రయాణం.. యువతకు మాత్రమే.. ఇలా చేయండి..!

25 రూపాయలతో ప్లేట్ టిఫిన్ కూడా రాదు. కానీ అదే రూ. 25తో దేశం మొత్తం చుట్టేయొచ్చు. ఈ విషయం మీకు తెలుసా..? యువత చాలామంది తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లాలని.. లైఫ్ ఎంజాయ్ చేయాలని భావిస్తుంటారు. కానీ చేతిలో డబ్బులు లేక కొంతమంది.. సమయం లేక మరి కొంతమంది వెనకడుగు వేస్తుంటారు. అయితే తాజాగా మీకోసం ఓ బంఫర్ ఆఫర్ వచ్చింది. కేవలం రూ. 25తోనే దేశం మొత్తం రైలులో ప్రయాణించవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని జాగృతి యాత్ర అంటారు. ఈ కార్యక్రమం ద్వారా కేవలం రూ.25 తోనే దేశం మొత్తం ప్రయాణించే అవకాశం యువతకు లభిస్తుంది. జాగృతి యాత్ర అనే ఈ ప్రత్యేక రైలు ప్రయాణం ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది రైల్వే శాఖ. దీనికోసం https://www.jagritiyatra.com/ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 15 గా ఉంది.

జాగృతి యాత్ర పేరుతో నడిచే ఈ రైలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే నడుస్తుంది. దీంట్లో ప్రయాణించడానికి 500 మంది యువతను మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణంలో యువతకు.. పలు నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలకు సంబంధించిన మెళకువలు నేర్పిస్తారు. అలా విహారంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది ఈ కార్యక్రమం. ఈ యాత్రలో భాగంగా కేవలం 15 రోజుల్లో ఈ రైలు సుమారు 8వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

ఇక ఈ రైలు దేశ రాజధాని దిల్లీ నుంచి ప్రారంభం అవుతుంది.. అలా అహ్మదాబాద్.. ముంబై.. బెంగళూరు మీదుగా ప్రయాణించి మధురై చేరుకుంటుంది. అక్కడి నుంచి ఒడిషా..ఆ తర్వాత మధ్య భారతం గుండా ప్రయాణించి చివరికి మళ్లీ దిల్లీ చేరుకుంటుంది. ఈ ప్రయాణంలో అనేక తీర్థ యాత్ర స్థలాలతోపాటు.. పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం కల్పిస్తారు.

Jagruti Yatra Nationwide Train Journey for Youth at Just Rs 25

ఈ యాత్ర ఏటా నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ యాత్రలో పాల్గొనాలనుకునే యువత సంబంధిత వెబ్ సైట్ లో ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే గమనిక ఏంటంటే.. ఈ రైలులో ప్రయాణించడానికి వయసు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. ఇక ఈ ఏడాది జాగృతి యాత్ర నవంబర్ 7న ప్రారంభం కానుంది. నవంబర్ 22న ముగియనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+