సాహిత్య కుంభమేళా.. జైపుర్ లిటెరేచర్ ఫెస్టివల్
పుస్తక ప్రియులకు పండగ జైపుర్ లిటెరేచర్ ఫెస్టివల్. సాహిత్య కుంభమేళా గా పేరుగాంచిన ఈ ఫెస్టివల్ కన్నుల పండగలా సాగింది. జనవరి 30న అట్టహాసంగా ప్రారంభమైన 18వ జైపుర్ లిటెరేచర్ ఫెస్టివల్ ఫిబ్రవరి 3న ముగిసింది. ఈ ఫెస్టివల్ లో 300 మందికి పైగా వక్తలు, నోబెల్ గ్రహీతలు, బుకర్ ప్రైజ్ విజేతలు, దిగ్గజ రచయితలు, కళాకారులు, విదేశాంగ ప్రతినిధులు, అధికారులు ఇలా అనేక మంది సాహిత్య ప్రియులు ఒకే దగ్గర చేరి తమ అనుభవాలు, విశేషాలను పంచుకున్నారు.
ఈ లిటెరేచర్ ఫెస్టివల్ లో సాహిత్యం,పుస్తక ప్రదర్శన, రాజకీయాలు, మానవహక్కులు,లింగ సమానత్వం, ఆరోగ్యం, సినిమా, మ్యూజిక్.. తదితర రంగాలపై చర్చలు జరిపారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఈ ఫెస్టివల్ లో ఎగానమిక్స్ లో నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ, ఫ్రెంచ్ అమెరికన్ ఎకానమిస్ట్ ఈస్తర్ డఫ్లో, నటుడు అమోల్ ఫలేకర్, ఇరా ముఖోతీ, గీతాంజలి శ్రీ, మాజీ విదేశాంగ ప్రతినిధి మన్ ప్రీత్ వోహ్రా, జర్నలిస్ట్ జార్జినా గోడ్విన్, ఇజ్రాయెల్ జర్నలిస్ట్ గిడియోన్ లెవీ, సినిమా డైరెక్టర్ మానవ్ కౌల్, లిరిసిస్ట్ జావేద్ అక్తర్.. లాంటి ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ ఫెస్టివల్ లో దేవి అండ్ అవతారాస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. పురాణాలు, ఇతిహాసాల్లో మహిళాశక్తి ప్రాధాన్యాన్ని ఈ బుక్ వివరిస్తోంది.ఇదే వేడుకలో ఓజాస్ ఆర్ట్ అవార్డ్ 2025 ను జైపుర్ కు చెందిన మినియేచర్ ఆర్టిస్టులు వినిత శర్మ, అజయ్ శర్మ లకు దక్కింది. ఇదే ఫెస్టివల్ లో ఖైలాష్ ఖేర్ లైవ్ ప్రదర్శన చేశారు.












Click it and Unblock the Notifications