ఫేస్‌బుక్ చిచ్చు : భార్య పాపులారిటీ తట్టుకోలేక.. నమ్మించి తీసుకెళ్లి హత్య చేసిన భర్త
ఫేస్‌బుక్,వాట్సాప్,టిక్‌టాక్‌లో పాపులారిటీయే ఈరోజుల్లో సోషల్ స్టేటస్‌గా మారిపోయింది. ఇందుకోసం చాలామంది పొద్దస్తమానం అందులోనే తలదూర్చి బతికేస్తున్నారు. సోషల్ యాప్స్ వాడటంలో తప్పు లేదు గానీ వాటికి ఎడిక్ట్ అయిపోతే కుటుంబ బంధాలకు దూరమవడం ఖాయం. అదే సమయంలో సోషల్ యాప్స్ ద్వారా వచ్చే క్రేజ్,పాపులారిటీ భార్యాభర్తల మధ్య గొడవలకు కూడా దారితీస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో భార్య పాపులారిటీని తట్టుకోలేకపోయిన ఆమె భర్త, ఆమెపై అనుమానం పెంచుకుని హత్యకు పాల్పడ్డాడు.

అసలేం జరిగింది..
రాజస్తాన్‌లోని జైపూర్‌కి చెందిన అజయ్ అహ్మద్(25),రేష్మ మంగ్లాణి(22) గతంలో ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసేవారు. అక్కడే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. పారిపోయి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం అహ్మద్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో సోషల్ మీడియా కారణంగా చిచ్చు రేగింది.

ఫేస్‌బుక్‌తో బిజీగా ఉంటోందని..
రేష్మ చాలాకాలంగా ఫేస్‌బుక్‌లో సొంతంగా ఒక పేజీ నిర్వహిస్తోంది. ట్రావెలింగ్‌కి సంబంధించిన వీడియోలను అందులో పోస్ట్ చేస్తుంటుంది. అలాగే భర్తతో కలిసి ఏదైనా పార్టీ లేదా ఫంక్షన్లకు వెళ్లినా.. ఆ ఫోటోలను అందులో పోస్ట్ చేస్తుంటుంది. తద్వారా ఇప్పటివరకు ఆమెకు 6వేల మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు.అయితే రేష్మ ఎప్పుడూ ఫేస్‌బుక్‌లో బిజీగా గడపడం అహ్మద్‌కు నచ్చలేదు.

అనుమానం...
రేష్మ తనతో కంటే ఫేస్‌బుక్‌లోనే ఎక్కువ సమయం గడుపుతోందని అహ్మద్‌కు పట్టరాని కోపం వచ్చేది. దీంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. రేష్మకు మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయేమోనని అహ్మద్ అనుమానించడం మొదలుపెట్టాడు. దీంతో గొడవలు మరింత పెద్దవయ్యాయి. భర్త గొడవలను తట్టుకోలేక రేష్మ పుట్టింటికి వెళ్లిపోయింది.

నమ్మించి తీసుకొచ్చి హత్య
రేష్మ పుట్టింటికి వెళ్లిన కొన్నిరోజులకు అహ్మద్ ఆమెను తీసుకురావడానికి వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను ఆమెకు సున్నితంగా నచ్చజెప్పి తన వెంట తీసుకెళ్లాడు. ఇద్దరం కలిసి సరదాగా అమెర్ అనే ప్రాంతానికి వెళ్దామని చెప్పి అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమె తలపై బండరాయితో మోది హత్య చేశాడు. మరుసటి రోజు ఉదయం రేష్మ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications