బిడ్డకు జన్మనిచ్చిన 2 గంటలకే.. పరీక్ష కేంద్రానికి వెళ్లిన తల్లి
జైపూర్: ఎక్కడ బలమైన కోరిక ఉంటుందో.. అక్కడ అవకాశం కూడా ఉంటుందని అంజుమీనా అనే ఓ మహిళ నిరూపించింది. ఆమెకు చదువంటే చాలా ఇష్టం. అయితే తన పరీక్షలు జరుగుతున్న సమయానికే ఆమె పురిటి నొప్పులతో బాధపడుతోంది.
కాగా, ఓ పాపకు జన్మనిచ్చిన అంజుమీనా.. కేవలం రెండు తర్వాత తన పరీక్షలకు హాజరుకావాలని నిర్ణయించుకుంది. అంతే, ఆలస్యం చేయకుండా జైపూర్‌లోని విద్యాసాగర్ మహిళా మహావిద్యాలయంలో జరుగుతున్న పరీక్షకు హాజరైంది.

రాజస్థాన్ పత్రిక కథనం ప్రకారం.. బిఏ చదువుతున్న అంజు తన ఇంటి నుంచి ఉదయం 7గంటలకు హిస్టరీ పరీక్ష రాసేందుకు బయల్దేరింది. అంతకుముందు జైపూర్‌లోని సంగనేరి ఆస్పత్రిలో ఉదయం 5గంటలకు ఆమె ఓ పాపకు జన్మనచ్చింది.
పరీక్ష రాసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను ఇప్పుడు పరీక్ష రాయకపోతే ఏడాది మొత్తం వృథా అయ్యేదని చెప్పింది. కాగా, కళాశాల అధికారులు కూడా ఆమె పరీక్ష రాసేందుకు తగిన ఏర్పాటు చేసి సహకరించారు.












Click it and Unblock the Notifications