ఊహించినట్టే- భారత్ లో చిచ్చుపెట్టిన డొనాల్డ్ ట్రంప్?
భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాత వైఖరిని ప్రదర్శిస్తోన్నారు. భారత్ తో కుదుర్చుకోవడం సహా పలు అంశాలపై ఆయన పదే పదే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తోన్నారు. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే నిలిపివేశానంటూ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొన్న ఆయన.. దాన్నే తాజాగా పునరుద్ఘాటించారు.
పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేయడానికి ట్రేడ్ డీల్ ను తెర మీదికి తెచ్చినట్లు గతంలో పలుమార్లు చెప్పుకొంటూ వచ్చారు డొనాల్డ్ ట్రంప్. సౌదీ అరేబియా, నెదర్లాండ్స్ వంటి విదేశీ పర్యటనల సమయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. యుద్ధాన్ని కొనసాగిస్తే ట్రేడ్ డీల్ ను కుదుర్చుకోబోమంటూ అప్పట్లో హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలు తాజాగా దేశ రాజకీయాల్లో సరికొత్త దుమారానికి తెర తీవాయి. భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోన్నాయి.
ప్రధాని మోదీ మౌనం వహించడంపై కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఈ నెల 21వ తేదీన ప్రారంభం అయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావిస్తామని, ప్రత్యేక చర్చకు డిమాండ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మే 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ రెండు విషయాలను 24 సార్లు పునరావృతం చేశారని గుర్తు చేశారు.
భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపడం, దాని కోసం ట్రేడ్ డీల్స్ ను ప్రస్తావించినట్లు ట్రంప్ చెప్పారని జైరామ్ రమేష్ చెప్పారు. ఇప్పుడు తాజాగా అయిదు యుద్ధ విమానాలు కూలిపోయాయని ఆయన కొత్తగా వాదిస్తున్నారని అన్నారు. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని, ఆయనకు బదులుగా వేరే నాయకుడు సమాధానం చెప్పడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఈ అంశంపై ప్రత్యేక చర్చను డిమాండ్ చేస్తాయని తెలిపారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి, డొనాల్డ్ ట్రంప్ వాదనలు, ఆపరేషన్ సింధూర్ అర్ధాంతరంగా నిలిపివేత, చైనా పాత్ర, కొత్త సవాళ్లపై రెండు మూడు రోజుల పాటు చర్చ జరగాల్సిన అవసరం ఉందని జైరామ్ రమేష్ అభిప్రాయపడ్డారు.
ఇదే విషయాన్ని ఆప్ కూడా ప్రస్తావిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న పదే పదే చెబుతున్న వ్యాఖ్యలు, ప్రకటనలపై ప్రధాని మోదీ ఏం సమాధానం చెబుతారనేది 140 కోట్లమంది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని పేర్కొంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా మోదీ వివరణ ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.
-
ఇరాన్ జీవనాడిపై అమెరికా దెబ్బ- ఓటమిని అంగీకరించిందని ట్రంప్ ప్రకటన -
ఖమేనీ ప్రాణాలతో లేడనే మాట వింటున్నా- ఇరాన్ సరెండర్ కావడం బెటర్: ట్రంప్ -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!!












Click it and Unblock the Notifications