వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జల్లికట్టు: సుప్రీంలో పిటిషన్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడులో అత్యంతపురాతన క్రీడ జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని మనివి చేస్తూ సుప్రీం కోర్టులో అర్జీ దాఖలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్బంగా 14,15, 16వ తేదీల్లో మూడు రోజుల పాటు జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టులో విన్నవించారు.

అయితే సంబంధిత బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చెయ్యాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీ.ఎస్. ఠాకూర్ ఆదేశించారు. జల్లికట్టుపై ఉన్న నిషేదాన్ని ఎత్తి వెయ్యాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై జస్టిస్ దీపక్ మిశ్రా, ఎన్వీ రమణలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం స్టే విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టులో మళ్లి పిటిషన్ దాఖలు అయ్యింది.

జయ, కరుణ డిమాండ్

జయ, కరుణ డిమాండ్

జల్లికట్టు నిర్వహించేలా అర్డినెన్స్ తీసుకురావాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఒకే నెలలో పెనుమార్పులు

ఒకే నెలలో పెనుమార్పులు

జల్లికట్టు క్రీడపై విధించిన నిషేదాన్ని ఇదే జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే జంతు పరిరక్షణ సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో స్టే విధించారు.

సంబరాలు...... నిరసనలు

సంబరాలు...... నిరసనలు

కేంద్రప్రభుత్వం జల్లికట్లుపై నిషేదం ఎత్తివెయ్యడంతో తమిళనాడు ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. సుప్రీం కోర్టు స్టే విధించడంతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

జనజీవనం స్తంభించింది

జనజీవనం స్తంభించింది

సుప్రీం కోర్టు స్టేతో తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తాయి. జల్లికట్టు అభిమానుల ఆందోళనతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.

జయలలిత మద్దతు

జయలలిత మద్దతు

జల్లికట్టు క్రీడను నిర్వహించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మొదటి నుంచి చెబుతున్నారు. కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఆమె కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

కరుణనిధి సపోర్ట్

కరుణనిధి సపోర్ట్

జల్లికట్టు క్రీడను నిర్వహించడానికి అర్డినెన్స్ తీసుకురావాలని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి డిమాండ్ చేస్తున్నారు.

కూల్ క్యాప్టెన్

కూల్ క్యాప్టెన్

డీఎండీకే అధినేత, క్యాప్టెన్ విజయ్ కాంత్ సైతం తమిళనాడులో జల్లికట్టు క్రీడను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

అన్ని పార్టీలు ఓకే అంటున్నాయి

అన్ని పార్టీలు ఓకే అంటున్నాయి

తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలు జల్లికట్టు నిర్వహించాలని అంటున్నాయి. సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో తమిళ ప్రజలు టెన్షన్ తో చస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి

ఆంధ్రప్రదేశ్ నుంచి

తమిళనాడులో జరిగే జల్లికట్టు క్రీడలు చూడటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున అభిమానులు వెలుతుంటారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని అర్ధం మంది తమిళనాడులోనే ఉంటారు. నెల్లూరు, కడప జిల్లాల నుంచి జల్లికట్టు అభిమానులు తమిళనాడు వెలుతుంటారు.

జల్లికట్టు క్రీడ ఇదే..... ఆఖరి ప్రయత్నం (వీడియో)

జల్లికట్టు క్రీడ నిర్వహించడానికి అభిమానులు చివరి ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీం కోర్టు అనుమతి ఇస్తుందని వారు ఆశగా ఎదురు చూస్తున్నారు.

English summary
State elections in Tamil Nadu are due later this year, and all parties have been urging the Centre to sanction the sport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X