వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు తమిళనాడు బంద్: తమిళ తంబీల ఉడుం పట్టు

సాంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుకు మద్దతుగా నేడు (శుక్రవారం) తమిళనాడు రాష్ట్ర బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. చదరంగ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ కూడా జల్లికట్టకు మద్దతు ప్రకటించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: సాంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుకు మద్దతుగా నేడు (శుక్రవారం) తమిళనాడు రాష్ట్ర బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. జల్లికట్టుకు మద్దతుగా తమిళనాడులో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. విద్యార్థులు జల్లికట్టుకు మద్దతుగా రంగంలోకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తమిళనాడు రాష్ట్ర బంద్ కు డీఎంకే పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. చదరంగ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ కూడా జల్లికట్టకు మద్దతు ప్రకటించారు. తాను జల్లికట్టుకు మద్దతుగా శుక్రవారం ఉపవాసం ఉంటానని సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ప్రకటించారు.

జల్లికట్టు నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని డీఎంకే నాయకురాలు, ఎంపీ కనిమొళి విమర్శించారు. జల్లికట్టు నిర్వహణపై చర్చించేందుకు వెంటనే తమిళనాడు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కనిమొళి డిమాండ్ చేశారు.

Jallikattu: Today Tamil Nadu Bundh

జల్లికట్టు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని అన్నాడీఎంకే ఎంపీలు ఢిల్లీలో వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. శుక్రవారం మద్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. జల్లికట్టు విషయంపై శనివారం అన్నాడీఎంకే ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.

గురువారం రాత్రి పూర్తిగా మెరీనా బీచ్ లో విద్యార్థులు కొవ్వోత్తులతో నిరసన వ్యక్తం చేశారు. రాత్రి చలిలో అక్కడే పడుకున్నారు. మొత్తం మీద తమిళనాడులో జల్లికట్టు విషయంపై తమిళ తంబీలు ఉడుంపట్టు పట్టడంతో అన్నాడీఎంకే ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంతోంది.

English summary
Chennai Marina protest continues as fourth day. Students are coming to marina at night times also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X