పరీక్ష పేపర్ లో అలాంటి ప్రశ్నా..? ప్రొఫెసర్ సస్పెండ్.. ఎక్కడంటే..?
సాధారణంగా విద్యార్థుల పరీక్ష పేపర్ లో సిలబస్ లేని ప్రశ్న వచ్చినా.. లేకపోతే తప్పుడు ప్రశ్న వచ్చినా ఆ ప్రశ్నను తొలగించడం లేదా విద్యార్థులకు మార్కులు వేయడం చేస్తుంటారు. అయితే ఇక్కడ ఓ పరీక్ష పేపర్ లో అలాంటి ప్రశ్న అడిగినందుకు ఏకంగా ప్రొఫెసర్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (JMI) యూనివర్సిటీలో జరిగింది. ఇంతకూ విద్యార్థులకు ఆ ప్రొఫెసర్ ఇచ్చిన ప్రశ్న ఏంటి..?
Jamia Millia Islamia suspends Social Work Dept professor for extremely provocative and communally polarising question in Semester 1 question paper. Inquiry ordered. FIR being filed.
— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) December 23, 2025
JMI is a Central University with a mixed student community. The question shows malicious intent. pic.twitter.com/GSHzJOsg2o
పరీక్షలో విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టేలా.. మతవాదాన్ని రెచ్చగొట్టేలా.. ప్రశ్నలు అడిగిన ప్రొఫెసర్ ను సస్పెండ్ చేశారు అధికారులు. దిల్లీలోని ప్రముఖ యూనివర్సిటీగా పేరుగాంచిన జామియా మిలియా ఇస్లామియా(JMI) యూనివర్సిటీలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. బీఏ(ఆనర్స్) సోషల్ వర్క్ సబ్జెక్ట్ విభాగంలో నిర్వహించిన పరీక్షలో క్వచ్చన్ పేపర్ లో ఓ ప్రశ్న తీవ్ర చర్చకు దారి తీసింది. విద్యార్థుల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ ప్రశ్న ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

ఈ క్వశ్చన్ పేపర్ ను ప్రొఫెసర్ వీరేంద్ర బాలాజీ షాహారే రూపొందించారు. ఈ పరీక్ష పేపర్ లో 'దేశంలో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దారుణాలను చర్చించేందుకు తగిన ఉదాహరణలు ఇవ్వండి' అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వమని పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు జవాబు రాస్తే 15 మార్కులు అని తెలిపారు. అయితే ఈ క్వశ్చన్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మేరకు యూనివర్సిటీకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే ఆ ప్రొఫెసర్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు పరీక్షలో ఇలాంటి ప్రశ్న ఇవ్వడంపై సదరు ప్రొఫెసర్ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications