జమ్మూకాశ్మీర్ ఎన్నికలు: ముగిసిన రెండో దశ పోలింగ్, ఓటింగ్ శాతం ఎంతంటే?
Jammu Kashmir Assembly Election 2024 Phase 2: జమ్మూకాశ్మీర్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. రెండో దశలో ఆరు జిల్లాల పరిధిలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. 25 లక్షలమందికిపైగా ఓటర్లు ఓటు వేశారు. శ్రీనగర్ జిల్లాలోని ఎనిమిది స్థానాలకు ఓటింగ్ జరిగింది. రియాసిలో ఆరు, బుద్గామ్‌లో ఐదు, రియాసి, పూంచ్ జిల్లాల్లో మూడు చొప్పున, గందర్‌బల్‌లో రెండు స్థానాలకు ఓటింగ్ జరిగింది.
బుధవారం సాయంత్రం 5 గంటల వరకు జమ్మూకాశ్మీర్‌లో 54 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా రియాసి జిల్లాలో 71.81 శాతం ఓటింగ్ నమోదు కాగా, శ్రీనగర్ జిల్లాలో అత్యల్పంగా 27.31 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. అంతకుముందు మధ్యాహ్నం 3 గంటల వరకు 46.12 శాతం ఓటింగ్ జరిగింది. అదే సమయంలో, మధ్యాహ్నం 1 గంట వరకు, మొత్తం కేంద్ర పాలిత ప్రాంతంలో 36.93 శాతం ఓటింగ్ జరిగింది. అంతకుముందు ఉదయం 11 గంటల వరకు 24.10 శాతం ఓటింగ్ జరిగింది.

రెండో దశలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. 'ఓటు వేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం లోయ, జమ్మూలో ఓటింగ్ ఉత్సాహంగా జరగడం మాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
#WATCH | J&K Assembly Election 2024 | Poonch: People in huge numbers gathered to vote for the 2nd phase of the assembly elections at the polling booths in the Pir Panjal Range of Surankote(ST) assembly constituency. pic.twitter.com/nV8kahn1QF
— ANI (@ANI) September 25, 2024
ఇంతకు ముందు సెప్టెంబర్ 18న జరిగిన తొలి దశలో 61.38 శాతం ఓటింగ్ శాతం నమోదైన విషయం తెలిసిందే. అత్యధికంగా కిష్త్వార్ జిల్లాలో 80.20 శాతం ఓటింగ్ జరగ్గా.. అత్యల్పంగా పుల్వామా జిల్లాలో 46.99 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
జమ్మూకాశ్మీర్ లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 1న జరగనున్నాయి. ఈ విడతలో మిగిలిన అన్ని స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications