ప్రధాని మోదీ ఎఫెక్ట్ తో తారుమారు అయిన సర్వేలు, మైండ్ బ్లాక్ సర్వే ఫలితాలు !
బెంగళూరు/బెళగావి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. బెంగళూరులో శనివారం, ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్ షోలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీకి బూస్ట్ ఇచ్చే సర్వే విడుదల కావడంతో ఆ పార్టీ నాయకులు మంచి జోరుమీద ఉన్నారు. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆ సర్వే తెలిపింది.
పోలింగ్ కు ఐదు రోజుల ముందు జన్ కీ బాత్-సువర్ణ న్యూస్ (కన్నడ) రెండో విడత సర్వే ఫలితాలు విడుదల చేసింది. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి మరోసారి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సర్వే తెలిపింది. కర్ణాటకలో మొదటిసారి బీజేపీ సొంత బలంతో అధికారంలోకి వస్తుందని జన్ కీ బాత్-సువర్ణ న్యూస్ సర్వే తెలిపింది.

జన్ కీ బాత్- సువర్ణ న్యూస్ రెండో సారి కర్ణాటకలోని వివిద జిల్లాల్లో ప్రజల అభిప్రాయం సేకరించింది. ఈ సర్వేలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని వెలుగు చూసింది. ఒకవేళ అధికారంలోకి రాకపోయినా బీజేపీ మాత్రమే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే ఫలితాలు వెలువడటంతో బీజేపీ నాయకులు ఖుషీగా ఉన్నారు.
జన్ కీ బాత్- సువర్ణ న్యూస్ సర్వే ప్రకారం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 100 నుంచి 114 స్థానాలు వస్తాయని, ఇక బీజేపీ ప్రభుత్వం మీద నిత్యం పోరాటం చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు 86 నుంచి 98 సీట్లు వస్తాయని, ప్రాంతీయ పార్టీ జేడీఎస్ కు 20 నుంచి 26 సీట్లు వస్తాయని, ఇతర పార్టీల అభ్యర్థులు 0 నుంచి 5 సీట్లు గెలిచే అవకాశం ఉందని సర్వే తెలిపింది.
ఇదే జన్ కీ బాత్- సువర్ణ న్యూస్ మొదట జరిపిన సర్వేలో బీజేపీకి 98 నుంచి 109 స్థానాలు వస్తాయని తెలిపింది. అయితే ఏప్రిల్ 29వ తేదీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చెయ్యడం, కాంగ్రెస్ పార్టీ మీద తనదైన శైలిలో విమర్శలు చెయ్యడంతో పరిస్థితులు తారుమారు అయ్యాయని, బీజేపీ పుంజుకుందని సర్వే తెలిపింది.

ప్రధాని నరేంద్ర మోదీ కల్యాణ కర్ణాటక, కిత్తూరు కర్ణాటక, పాత మైసూరు, కరావళి కర్ణాటక, మధ్య కర్ణాటక ప్రాంతాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించడంతో బీజేపీ బలం పుంజుకుందని, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అలా చెయ్యలేకపోయాయని సర్వే అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారని సర్వే తెలిపింది.
కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలన్నా 113 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈసారి బీజేపీ 114 సీట్లు వస్తాయని ఈసర్వేలో వెలుగు చూడటంతో బీజేపీకి కొంచెం బలం వచ్చినట్లు అయ్యింది. శనివారం, ఆదివారం బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు ఉండటంతో ఐటీ హబ్ లో కూడా పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశం ఉందని జన్ కీ బాత్- సువర్ణ న్యూస్ కన్నడ సర్వే తెలిపింది.












Click it and Unblock the Notifications