భారత్‌లో జపాన్ రూ. 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు.! మోదీ - ఫుమియో కిషిడా మధ్య ద్వైపాక్షిక చర్చలు !!
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో భారత ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ సమావేశయ్యారు. ఇరుదేశాల ప్రధాన మంత్రులు, ప్రతినిధుల మధ్య 14వ వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిగాయి. భారత్-జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఇండో-పసిఫిక్ లో శాంతి, స్థిరత్వంపై కూలకుషంగా చర్చించారు. అటు ఉక్రెయిన్ -రష్యా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరంపై కూడా ఇరుదేశాల ప్రధానులు చర్చించినట్లు అధికారులు తెలిపారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి.
Recommended Video

1 భారత్ -జపాన్ మధ్య 14వ వార్షిక శిఖరాగ్ర సదస్సు
అంతకు ముందు రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి హైదరాబాద్ హైస్‌కు చేరుకున్న జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. భారత్ -జపాన్ మధ్య 14వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరుదేశాలు ప్రధాన మంత్రులు, ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.
2 సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్‌లో సహకారం
ఈ సందర్భంగా భారత్-జపాన్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, ఇన్‌ఫర్మేషన్ షేరింగ్ మరియు సహకారం రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
3 భారత్‌లో జపాన్ రూ. 3.2 లక్షల కోట్లు పెట్టుబడులు
ఈ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ జపాన్ కంపెనీలకు భారత్‌లో సాధ్యమైన అన్నివిధాల సహాయ సహకారాలను అందిస్తున్నామని తెలిపారు. కిషిడా భారతదేశానికి పాత మిత్రుడు అని కొనియాడారు. అయన జపాన్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు అతనితో తమ అభిప్రాయాలు పంచుకునే అవకాశం తనకు లభించిందని మోదీ తెలిపారు. భారత్ -జపాన్ ల మధ్య సురక్షితమైన సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు . ఇరుదేశాల మధ్య స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడానికి ఈ శిఖరాగ్ర సదస్సు దోహదం చేస్తోందని తెలిపారు. భారత్‌లో వచ్చే ఐదేళ్లలో జపాన్ రూ. 3.2 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుందని ప్రధాని మోదీ చెప్పారు.

4 ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చ
అనేక సంక్షోభాలతో ఈ రోజు ప్రపంచం మొత్తం అల్లాడిపోతుందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆవేదన వ్యక్తం చేశారు. భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వాములని , ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడి 70 ఏళ్లు పూర్తవుతున్నాయన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల గురుంచి ఇరుదేశాలు చర్చించుకున్నామని కిషిడా తెలిపారు. అంతర్జాయ చట్టం ఆధారంగా ఉక్రెయిన్, రష్యా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. భారత్‌తో పాటు జపాన్ కూడా యుద్ధానికి ముగించేందుకు ప్రయత్నిస్తూనే ఉందని చెప్పారు.
5 తొలిసారి భారత్-జపాన్ ప్రధానుల భేటీ
భారత్-జపాన్ ప్రధానమంత్రులు ఢిల్లీలో సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య చివరిసారిగా 2018లో ట్యోక్యో వేదికగా శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2019లో అప్పటి ప్రధాని షింటో అబే ఇండియాలో పర్యటించాల్సి ఉంది. కానీ అస్సాంలో పౌరసత్వ చట్టంపై నిరసనలు చెలరేగడంతో షింటో అబే భారత్ పర్యటన రద్దు చేసుకున్నారు. అనతరం కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లో ఇరు దేశాల మధ్య శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించలేదు. అసమయంలో వీడియో కాన్సరెన్సు, టెలిఫోన్ ద్వారా పలు అంశాలపై ఇరుదేశాల ప్రధానులు చర్చించారు. అనంతరం జపాన్ లో జరిగిన రాజకీయ పరిణామాలతో ఆ దేశ ప్రధానిగా ఫుమియో కిషిడా అయ్యారు.
6 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అతిథ్య
ఈ ఏడాది 14వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి భారత్ అతిథ్యమిస్తుంది. ఈనేపథ్యంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా రెండు రోజుల పాటు ఇండియాలో పర్యటిస్తున్నారు. తొలి రోజు జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత్ ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని కిషిడా పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అటు ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలన పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు భారత్ -జపాన్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మరో తోడ్పడుతుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. శాంతి, శ్రేయస్సు కోసం ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications