చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళనాడులో 6న సెలవుదినం: కేంద్రం సంతాప దినం, కేరళ, కర్ణాటకలో కూడా

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జ్ఞాపకార్థంగా డిసెంబరు 6ను ప్రభుత్వ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన జారీచేసింది. ఇక నుంచి ఏటా అన్ని ప్రభుత్వ, పురపాలక శాఖలకు ఈ సెలవు వర్తిస్తుంది.

రజినీకాంత్ వర్సెస్‌ జయలలిత: అప్పుడలా.. ఆ తర్వాతిలా!రజినీకాంత్ వర్సెస్‌ జయలలిత: అప్పుడలా.. ఆ తర్వాతిలా!

పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, రోజువారీ వేతనాలు తీసుకునే అందరికీ జీతం చెల్లింపు(పెయిడ్‌ హాలిడే)గా ప్రకటించారు. 75 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సోమవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Photos : జయలలిత కు నివాళి

ఆమె మృతితో తమిళనాడు రాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమెను కడసారి చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దయెత్తున ప్రజలు చెన్నైకి తరలివస్తున్నారు.
ఆమె పార్థీవదేహాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళుర్పిస్తున్నారు.

Jaya to be accorded state funeral- Centre declares one day mourning

కేంద్రం సంతాప దినం

జయలలిత మృతి చెందిన నేపథ్యంలో మంగళవారం(డిసెంబర్)ను కేంద్ర ప్రభుత్వం సంతాప దినంగా ప్రకటించింది. ఈ క్రమంలో జాతీయ జెండాను సగం వరకు దించనున్నారు. ఎలాంటి వేడుకలు నిర్వహించడం జరగదు.

'అమ్మ' అని అందుకే పిలుచుకుంటారు: వెంకయ్య, రోశయ్య విచారం'అమ్మ' అని అందుకే పిలుచుకుంటారు: వెంకయ్య, రోశయ్య విచారం

కేరళ, కర్ణాటకల్లో సెలవు

జయలలిత మృతి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలుగా, మూడు రోజులపాటు సెలవు దినాలుగా ప్రకటించింది. కాగా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కూడా మంగళవారంను సంతాప దినంగా ప్రకటించాయి.

English summary
The Central government on Tuesday has declared one day mourning, as a mark of respect to late Chief Minister J Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X