"జయలలితది సహజ మరణం కాదు!.. హత్య"
జయలలితది సహజ మరణం కాదని ఆమెను హత్య చేశారని అమృత ఆరోపిస్తుండటం గమనార్హం.
మండ్య: తమిళ దివంగత సీఎం జయలలిత మృతిపై అనుమానాలు పెచ్చరిల్లుతున్నాయి. సినీ నటి గౌతమి తొలుత ఈ విషయంపై ప్రధానికి లేఖ రాయగా.. ప్రతిపక్ష నేత స్టాలిన్ సహా పలువురి నుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. అమ్మ మరణంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.

ఇలాంటి తరుణంలో తాజాగా జయలలిత సోదరి కూతురు అమృత కూడా జయ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. జయది సహజ మరణం కాదని ఆమెను హత్య చేశారని అమృత ఆరోపిస్తుండటం గమనార్హం. జయ అంత్యక్రియల జరిగిన తీరు పట్ల కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. మా పెద్దమ్మ అంత్యక్రియలను ఈరకంగా చేస్తారని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
శశికళ వల్లే జయలలిత తమను దూరం పెట్టారని అమృత ఆరోపించారు. శుక్రవారం నాడు శ్రీరంగ పట్టణంలో జయ ఉత్తర క్రియలను అమృత, బంధువులు కలిసి వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications