శశికళ ఫ్మామిలీలో ఐటీ దాడులు, పుట్టి రోజు వేడుకలు చెయ్యాలి, గేటుబయటే, వివేక్ భార్య కీర్తనా!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: శశికళ ఫ్యామిలీ మీద పంజా విసిరిన ఐటీ శాఖ అధికారులు పలు కీలక పత్రాలు, విలువైన డాక్యూమెంట్లు సీజ్ చేశారని తెలిసింది. జాజ్ సినిమాస్ సీఇవో, జయ టీవీ ఎండీ వివేక్ ఇంటి ముందు వారి బంధువులు వేచి చూస్తున్నారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో లోపలికి పంపించడానికి అంగీకరించమని ఐటీ శాఖ అధికారులు తేల్చి చెప్పారు.

  IT raids on Jaya TV just After 3 days of Modi-Karunanidhi meet

  జయలలిత మేనల్లుడు, ఇళవరసి కుమారుడు వివేక్ భార్య కీర్తనాకు ఈ రోజు (నవంబర్ 11) పుట్టిన రోజు. కీర్తనా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు చెప్పడానికి శనివారం ఆమె తల్లిదండ్రలతో పాటు బంధువులు వివేక్ ఇంటి దగ్గరకు వెళ్లారు. వివేక్ ఇంటిలో గత మూడు రోజులుగా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.

  Jaya TV MD Viveks wife celebrates her birthday amidst IT raid in Chennai

  శశికళకు బినామిగా వివేక్ ఉన్నాడని ఇప్పటికే పలు కీలపత్రాలు ఆదాయపన్ను శాఖ అధికారుల చేతికి చిక్కాయని తెలిసింది. ఇలాంటి సందర్బంలో ఇంటిలోని వ్యక్తులు బయటకు వెళ్లినా, బయటి వ్యక్తులు ఇంటిలోకి వచ్చినా సోదాలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

  కీర్తనా కుటుంబ సభ్యులు, బంధువులను వివేక్ ఇంటిలోకి అనుమతించడానికి ఆదాయపన్ను శాఖ అధికారులు నిరాకరించారు. ఎంతసేపు అయినా సరే ఇక్కడే ఉంటామని, కీర్తనా పుట్టిన రోజు వేడుకలు నిర్వహిచి శుభాకాంక్షలు చెప్పిన తరువాతే ఇక్కడి నుంచి వెలుతామని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు వివేక్ ఇంటి ముందు మకాం వేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Vivek wife Keerthana's relatives halted in front of her house to wish her as today is her birthday but officials rejected permission to meet her.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి