జయలలితకు కర్ణాటక ప్రభుత్వం షాక్: సుప్రీంలో అపీల్

బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పును సుప్రీం కోర్టులో అప్పీలు చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయనిపుణుల సలహా మేరకు కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో సోమవారం విధాన సౌధలో మంత్రివర్గ సమావేశం జరిగింది. సిద్దరామయ్య తన మంత్రి వర్గంతో పలు విషయాలు చర్చించారు. అదే సమయంలో ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించారని జయలలిత మీద నమోదు అయిన కేసు పరిణామాలపై కూడా చర్చ జరిగింది.

కర్ణాటక హై కోర్టు ఏకసభ్య బెంచ్ న్యాయమూర్తి సీ.ఆర్. కుమారస్వామి మే 11వ తేది జయలలిత అక్రమాస్తుల కేసు కొట్టి వేస్తు ఆ కేసులో ఉన్న అందరికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం చర్చకు వచ్చంది. జయలలిత కేసు సుప్రీం కోర్టులో అప్పీలు చెయ్యాలని న్యాయనిపుణులు ఇచ్చిన సలహాలను పరిశీలించారు.

Jayalalithaa case, decided to file an appeal in the Supreme Court

స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీ.వి.ఆచార్య, అడ్వకేట్ జనరల్ రవివర్మ సైతం జయలలిత కేసు సుప్రీంలో అప్పీలు చెయ్యాలని ప్రభుత్వానికి సూచించారు. ఇదే సమయంలో మే 24వ తేదిన జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

బీబీఎంపీ ఎన్నికలు జరుగుతున్నందు వలన జయలలిత కేసును సుప్రీంలో అప్పీలు చేస్తే బెంగళూరులోని తమిళ సోదరులు తమ పార్టీకి ఓట్లు వెయ్యరని, అప్పీలు చెయ్యరాదని మంత్రులు, కాంగ్రెస్ శాసన సభ్యులు సిద్దరామయ్య మీద ఒత్తిడి తీసుకు వచ్చారు. అయితే చివరికి సుప్రీంలో అప్పీలు చెయ్యాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+