జేబులో జయలలిత ఫోటో.. విజయ్ క్యాబినెట్‌లో ‘అమ్మ’ ముద్ర!

రాజకీయాల్లో పార్టీలు మారవచ్చు.. పదవులు మారవచ్చు.. కానీ ప్రాణం ఇచ్చే నాయకుడిపై ఉండే విశ్వాసం మాత్రం మారదని నిరూపించారు తమిళనాడు సీనియర్ మంత్రి కేఏ సెంగోట్టయన్. తమిళనాడు 17వ శాసనసభ కొలువుదీరిన వేళ, సీఎం విజయ్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, తన చొక్కా జేబులో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫోటోను పెట్టుకుని అసెంబ్లీలో అడుగుపెట్టడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

తమిళనాడు అసెంబ్లీలో నేడు నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా సాగింది. సీఎం విజయ్ ప్రమాణం చేసిన అనంతరం మంత్రుల వంతు వచ్చింది. ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయం నుంచి గెలుపొందిన సీనియర్ నేత సెంగోట్టయన్ ప్రమాణ స్వీకారం కోసం వేదికపైకి వచ్చినప్పుడు అందరి కళ్లు ఆయన షర్ట్ జేబుపైనే నిలిచాయి. అక్కడ నిలువెత్తు 'అమ్మ’ (జయలలిత) ఫోటో స్పష్టంగా కనిపించింది. నిన్నటి ప్రమాణ స్వీకారంలోనే కాదు, నేడు శాసనసభ్యునిగా ప్రమాణం చేసే సమయంలోనూ ఆయన తన ఆరాధ్య దైవం ఫోటోను వెంటే ఉంచుకున్నారు.

Jayalalithaa In Heart TVK In Hand Senior Minister Sengottaiyan s Emotional Gesture In TN Assembly

పార్టీ మారినా.. గుండెల్లో ఆమె స్థానం పదిలం!

దశాబ్దాల పాటు అన్నాడీఎంకేలో జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా, ఆమె హయాంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన చరిత్ర సెంగోట్టయన్ ది. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గతేడాది ఆయన విజయ్ నేతృత్వంలోని 'TVK' (తమిళగ వెట్రి కజగం)లో చేరారు. పార్టీ మారినప్పటికీ, తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన జయలలితను ఆయన మర్చిపోలేదు. "జెండా మారినా.. నా గుండెల్లో ఉండే అజెండా 'అమ్మ’ మాత్రమే" అని ఆయన తన చర్య ద్వారా మౌనంగానే చాటిచెప్పారు.

అధ్యక్షా.. అసెంబ్లీలో తలపతి విజయ్ మాస్ ఎంట్రీ..
అధ్యక్షా.. అసెంబ్లీలో తలపతి విజయ్ మాస్ ఎంట్రీ..

విజయ్ పెద్దమనసు.. విలక్షణ రాజకీయం!

సాధారణంగా ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ నాయకుల ఫోటోలను ప్రదర్శించడం క్రమశిక్షణారాహిత్యంగా భావిస్తారు. కానీ, తన కేబినెట్‌లోని ఒక సీనియర్ మంత్రి తన మాజీ నాయకురాలి ఫోటోను జేబులో పెట్టుకోవడానికి సీఎం విజయ్ అంగీకరించడం విశేషం. ఇది విజయ్ రాజకీయ పరిణతిని, సీనియర్ల పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిద్ధాంతాలు వేరైనా, వ్యక్తిగత విధేయతలకు విలువ ఇచ్చే కొత్త తరహా రాజకీయం తమిళనాడులో కనిపిస్తోంది.

సీఎం సార్.. లుక్ అదిరింది! ఫార్మల్ లుక్‌లో విజయ్ ఎంట్రీ
సీఎం సార్.. లుక్ అదిరింది! ఫార్మల్ లుక్‌లో విజయ్ ఎంట్రీ

సెంగోట్టయన్ చర్య ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఒక భావోద్వేగపూరితమైన చర్చకు దారితీసింది. "జయలలిత క్రమశిక్షణ, పరిపాలనా దక్షతను స్ఫూర్తిగా తీసుకుని విజయ్ ప్రభుత్వంలో పనిచేస్తాను" అనే సంకేతాన్ని ఆయన పంపినట్లయింది. పార్టీలకతీతంగా ఈ 'విధేయత’ను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+