ఏపీ, టీకి రాయితీ: నష్టమని మోడీపై జయ అసహనం

చెన్నై: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పన్ను వెసులుబాటు ఇవ్వడం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తన అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాంతీయ ఆధారిత పన్ను రాయితీ ఇవ్వడాన్ని ఆమె తప్పు పట్టారు.

జయలలిత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ లేఖలో ప్రాంతీయ ఆధారిత పన్ను రాయితీ పైన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాయితీలు ఇవ్వడం వల్ల.. పక్క రాష్ట్రాల నుండి పెట్టుబడులు, పరిశ్రమలు తరలి వెళ్లే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.

 Jayalalithaa opposes area-based tax concessions to AP, Telangana State

దీని వల్ల పక్క రాష్ట్రాలు పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ, ఏపీలతో పోటీ పడలేని స్థితి ఉంటుందన్నారు. ఇలాంటి వాటి పట్ల మీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.

అలాంటి రాయితీల వల్ల ప్రస్తుత పరిశ్రమలకు కొత్త పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఈ పరిస్థితి పొరుగు రాష్ట్రాల్లోనూ, అలాంటి రాయితీ కల్పించిన ప్రాంతాల్లోనూ ఎదురవుతుందన్నారు. ఇది పూర్తిగా సమర్థించలేనిదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+