జయ డెత్ రిపోర్టు హైకోర్టుకు ఇచ్చిన ప్రభుత్వం, అపోలో: ఏం ఉందంటే !

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎలా మరణించారు ? అనే పూర్తి వివరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం, అపోలో ఆసుపత్రి యాజమాన్యం గురువారం మద్రాస్ హైకోర్టులో సమర్పించాయి. జయలలితకు అందించిన చికిత్స వివరాలు నివేదికలో సమర్పించారు.

చెన్నైకి చెందిన జోసెఫ్ అనే అన్నాడీఎంకే నాయకుడు జయలలిత మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని, తమిళనాడు ప్రభుత్వం, అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్ విచారించిన మద్రాస్ హైకోర్టు ఫిబ్రవరి 23వ తేదీలోపు నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వానికి, అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. గురువారం తమిళనాడు ప్రభుత్వం, అపోలో ఆసుపత్రి యాజమాన్యం జయలలిత డెత్ రిపోర్టును హైకోర్టులో సమర్పించాయి.

Jayalalithaa’s death report has submitted by Tamil Nadu Government to the Madras High Court

చికిత్స పొందుతున్న సమయంలో జయలలిత స్వయంగా తన ఫోటోలు విడుదల చెయ్యరాదని మనవి చేశారని, అందుకే తాము ఆమె ఫోటోలు విడుదల చెయ్యలేదని నివేదికలో హై కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ అథారిటీ (ఎంసీఏ) ఆదేశాలను తాము పాటించామని కోర్టుకు నివేదిక ఇచ్చారు.

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ అథారిటీ నియమాల ప్రకారం చికిత్స పొందుతున్న వ్యక్తలు ఆసుపత్రిలో ఉన్న తన ఫోటోలను విడుదల చెయ్యరాదని చెబితే ఆ నియమాలు పాటించాలని హైకోర్టుకు తెలిపారు. నివేదిక పరిశీలించిన మద్రాస్ హై కోర్టు కేసు విచారణ మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+