జైలుకు జయ: మోడీకి సుబ్రహ్మణ్య స్వామి థ్యాంక్స్
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కేసు విషయమై ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ధన్యవాదాలు తెలిపారు. జయలలిత ఆస్తుల కేసులో న్యాయమూర్తి స్వేచ్ఛగా తన తీర్పును వెలువరించారని, మోడీ చట్టపరమైన చర్యలను ప్రభావితం చేయలేదన్నారు.
తాను తమిళనాడు రాష్ట్రంలో పెద్ద పార్టీ అయిన, అతిపెద్ద నాయకురాలితో ఫైట్ చేస్తున్నానని, ఈ నేపథ్యంలో ఈ కేసు పైన ప్రభావం పడుతుందని భావించానని చెప్పారు. తాను ఇదే విషయమై మోడీని కలిశానని, ఆయన తనకు పూర్తి హామీ ఇచ్చారన్నారు. చట్టపరంగా ఎవరైనా స్వేచ్ఛగా వెళ్లవచ్చునని మోడీ సూచించారు.

ఈ కేసు విషయమై ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయని తెలిపారు. చాలామంది వారి వారి పూర్తి ప్రయత్నాలు చేశారని తెలిపారు. అయితే, ఈ కేసు విత్ డ్రా వరకు వెళ్లనందుకు సుబ్రహ్మమ్య స్వామి ధన్యవాదాలు తెలిపారు. ఆస్తుల కేసులో కోర్టు సరైన తీర్పు ఇస్తుందనే తాను భావించానని, అదే తీర్పు వచ్చిందన్నారు. అయితే, తీర్పు కొంత ఆలస్యమైందన్నారు.












Click it and Unblock the Notifications