వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయనగర్ అసెంబ్లీ ఎన్నిక: సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన బీజేపీ, కాంగ్రెస్ గెలుపు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని జయనగర్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. బీజేపీ అభ్యర్థి బీఎన్ ప్రహ్లాద్‌పై కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డి 3,775 ఓట్లతో గెలుపొందారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జయనగర్ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నేత బీఎన్ విజయకుమార్ మరణంతో ఆ స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఆ స్థానంకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిగా విజయకుమార్ సోదరుడు బీఎన్ ప్రహ్లాద్‌ను బరిలోకి దించింది.

Jayanagar Election: Sowmya Reddy beats BJP’s B N Prahlad by 3,775 votes

అయితే, జయనగర్ ఎన్నికల్లో ప్రహ్లాద్ ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డికి 54,457ఓట్లు రాగా, బీఎన్ ప్రహ్లాద్‌కు 51,568 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికే జేడీఎస్ కూడా మద్దతు తెలపడం గమనార్హం.

కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు, కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 సీట్లు స్థానాలు దక్కించుకున్నాయి. అయితే, కాంగ్రెస్, జేడీఎస్ కలిసి కర్ఱాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

English summary
Sowmya Reddy of the Congress has won the prestigious Jayanagar assembly elections. Sowmya Reddy the daughter of Congress veteran, Ramalinga Reddy beat the BJP's B N Prahlad by 3,775 votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X