ఫైర్ బ్రాండ్ ఎంపీకి షాక్, సౌమ్య రెడ్డి దెబ్బతో కేసు, ఏం వీడియో పోస్టు చేశారంటే? టార్గెట్!

బెంగళూరు సౌత్‌ బీజేపీ అభ్యర్థి, ఆ నియోజక వర్గం సిట్టింగ్ ఎంపీ తేజస్వి సూర్య మతం ఆధారంగా ఓట్లు అడిగారని ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై బెంగళూరులోని జయనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందని చీఫ్ రిటర్నింగ్ అధికారి తెలిపారు. తేజస్వి సూర్య ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేసి మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించినందుకు కేసు నమోదైందని చీఫ్ రిటర్నింగ్ అధికారి తెలిపారు.

లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్బంగా ఓటర్లు వచ్చి తమ హక్కులు వినియోగించుకోవాలని బీజేపీ అభ్యర్థి తేజస్వి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ను సరిహద్దు భద్రత, ఆర్టికల్ 370తో పాటు రామమందిరాన్ని పేర్కొన్న చివరి వీడియోను విడుదల చేశారు. చివరి నాలుగు గంటల ఓటింగ్‌ను పూర్తిగా వినియోగించుకోవాలని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Jayanagar police have registered a case against Bengaluru South BJP MP Tejaswi Surya

అంతకుముందు బీజేపీ ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌కు రావడానికి తేజస్వి సూర్య 80%-20% పోలికలు ఇచ్చారు. మేం బీజేపీ ఓటర్లు 80 శాతం. కానీ కేవలం 20 శాతం మంది మాత్రమే బయటకు వచ్చి ఓటు వేశారని, కాంగ్రెస్ ఓటర్లు 20 శాతం అయితే బయటకు వచ్చి 80 శాతం ఓటేస్తున్నారు. చాలా పోలింగ్ బూత్‌లలో ఇదే వాస్తవం. మీరు ఓటు వేయకుంటే 20 శాతం మంది కాంగ్రెస్‌ ఓటర్లు కచ్చితంగా ఓటు వేస్తారని తేజస్వి సూర్య ఎక్స్ లో పోస్టు చేశారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి మత ప్రాతిపదికన ఓట్లు అడిగినందుకు గాను బెంగళూరు సౌత్ బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డి డిమాండ్ చేశారు. తాను ఓడిపోతానని తేజస్వి సూర్యకు ముందే తెలుసు అని సౌమ్యా రెడ్డి ఆరోపించారు. తేజస్వి సూర్య ఓటు వేసిన తరువాత కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 30 సీట్లకు మించి గెలవదని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశకు లోనైంది. 30 సీట్ల కంటే ఎక్కువ గెలవదని పోల్ సర్వేలు చెబుతున్నాయి. అందుకే వారు ప్రధాని మోదీపై వ్యక్తిగత దాడులు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తేజస్వి సూర్య ఆరోపించారు. మతం ప్రతిపాదికన ఓటర్లను ఓటు వెయ్యాలని సోషల్ మీడియాలో పోస్టు చేసిన బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే సిట్టింగ్ ఎంపీ తేజస్వి సూర్య ఇంకా ఈ విషయంపై స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+