సెక్స్ స్కాండల్ కేసులో ట్విస్ట్, భార్య ముఖం కూడా చూడకుండా తిరుగుతున్న మాజీ మంత్రి
కర్ణాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది, మహిళ కిడ్నాప్ కేసులో ఆరు రోజులుగా పరప్ప అగ్రహార జైలులో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్ డీ రేవణ్ణ ఇప్పుడు జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలై మూడు రోజులు గడుస్తున్నా మాజీ మంత్రి రేవణ్ణను ఆయన భార్య భవానీ రేవణ్ణను కలవకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ జైలు నుంచి వచ్చిన తర్వాత టెంపుల్ రన్ చేస్తున్నారు. జైలు నుంచి విడుదల అయిన తరువాత జేడీఎస్ పార్టీ నాయకును కూడా కలవడానికి ఇష్టపడని మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ ఇప్పుడు దేవాలయాలు తిరుగుతూ కాలం గడిపేస్తున్నారు. కొడుకు విదేశాలకు పారిపోవడంతో భార్య భవానిని కూడా కలవడానికి ఇష్టపడని మాజీ మంత్రి రేవణ్ణ ఆప్పుడు కేవలం పుణ్యక్షేత్రాలు తిరగడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు.

బెంగళూరులోని తండ్రి నివాసంలో ఉంటున్న హెచ్‌డీ రేవణ్ణ ఇప్పటి వరకు ఆయన భార్య భవానీని కలవలేదు, జైలు నుంచి విడుదలై నాలుగు రోజులు గడిచినా కేసు కారణంగా భార్య భవానీని కలవలేదు. రేవణ్ణ, కుమారుడు ఎంపీ ప్రజ్వల్, భార్య భవానీలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసుల్లో భవానీ రేవణ్ణ పేరు ప్రస్తావనకు వచ్చింది. తనకు ఫోన్ చేయమని చెప్పి ఓ మహిళను కిడ్నాప్ చేసినట్లు భవానీపై ఆరోపణలు వచ్చాయి.
విచారణలో భవానీకి వ్యతిరేకంగా ఆధారాలు దొరికితే వారికి ఇబ్బంది ఉంటుంది. కిడ్నాప్ కేసులో రేవణ్ణ జైలుకు వెళ్లడానికి పరోక్షంగా ఆయన భార్య భవానీ రేవణ్ణ కారణమనే అనుమానం కూడా ఉంది. కొడుకు జైలుకు వెళ్లడానికి కోడలు కారణమని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కలత చెందుతున్నారని జేడీఎస్ పార్టీ నాయకులు అంటున్నారు.
ప్రస్తుతం మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ భార్య భవానీ మైసూరు జిల్లా సాలిగ్రామంలో ఒంటరిగా ఉంటూ హలేనరసిపుర్‌లోని వారి ఇంటికి వచ్చి వెళ్తోంది. కిడ్నాప్ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే రెండు నోటీసులు జారీ అయ్యాయి. ఈ మధ్యే భవానీ ఆమె మామగారు దేవెగౌడ, అత్తగారు చెన్నమ్మలను కూడా కలిశారు. భర్త జైలు నుంచి విడుదలై మూడు రోజులు గడుస్తున్నా భవానీ రేవణ్ణ తనను కలవడానికి రాలేదని జేడీఎస్ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications