ఒడిశాలో ఆగివున్న లారీని ఢీకొన్న జీపు... 8 మంది మృతి...
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేంఘహార్ జిల్లాలోని బాలిజోడి జాతీయ రహదారి పక్కన శుక్రవారం ఉదయం ఓ ఘోర ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొనడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మరో 12 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం దాటికి జీపు ముందుభాగం నుజ్జునుజ్జు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వ్యాన్ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.
గంజాం జిల్లాకు చెందిన రెండు కుటుంబ సభ్యులు కెంఝహార్ జిల్లాలోని ఘటగావ్‌లో ఉన్న మాతా తారిణి ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన ఆగివున్న లారీని జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద సమయంలో జీపులో 20 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు వివరించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మాతా తారిణి ఆలయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

వారంతా గంజాం జిల్లాలోని పొడమరి గ్రామానికి చెందినవారని పోలీసులు విచారణలో తేలింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడిన 12 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని కటక్ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. మిగిలిన వారిని కెందుజార్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చేర్పించారు. మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల అంచనా. గాయపడిన వారిలో పలువురు మాజీ రాజ్యసభ సభ్యుడు రేణుబాల ప్రధాన్ బంధువులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications