జెట్ ఎయిర్‌వేస్ సిబ్బంది నిర్వాకం: ప్రయాణీకులకు ముక్కు-చెవుల నుంచి రక్తస్రావం
Recommended Video

న్యూఢిల్లీ: జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది నిర్వాకం వల్ల ప్రయాణీకులకు ముక్కు, చెవుల నుంచు రక్తస్రావం జరిగింది. దాదాపు ముప్పై మంది ప్రయాణీకులు బాధితులు ఉన్నారు. ముంబై నుంచి జైపూర్ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణీకులకు రక్తస్రావం వల్ల విమానం తిరిగి వెనక్కి వచ్చి ముంబైలో ల్యాండ్ అయింది. బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనతో జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది నిర్వాకం మరోసారి బయటపడింది. సిబ్బంది పొరపాటు కారణంగా 30 మంది ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు.

విమానం కేబిన్‌లో ఒత్తిడి తగ్గించే స్విచ్‌ను ఆన్ చేయకపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కారణంగా 30 మందికి రక్తస్రావం కాగా, మరికొంతమంది తలనొప్పి అని చెప్పడంతో ఆక్సిజన్ మాస్క్‌లు అడిగి తీసుకున్నారు.
విమానాల్లో ప్రెజరైజేషన్ సిస్టమ్ చాలా ముఖ్యమైనది. క్రమంగా విమానం పైకి వెళ్తుంటే ఒత్తిడిని తగ్గించేందుకు దీనిని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఊపిరిపీల్చుకోవడానికి సులభమవుతుంది. పైకి వెళ్తుంటే తక్కువ గాలి, తక్కువ ఆక్సిజన్ కారణంగా ఇది బ్యాలెన్స్ చేస్తుంది. 18,000 అడుగులు ఎత్తుకు వెళ్తే వాతావరణ పీడనం 7.3 పీఎస్ఐ తగ్గుతుంది. అప్పుడు తగినంత గాలి, ఆక్సిజన్ పీల్చడానికి ఉండదు. మెదడుకు అందదు. ఒత్తిడి తగ్గించే బటన్ ఆన్ చేస్తే ఇబ్బంది ఉండదు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications