G20 summit: రాష్ట్రపతి నుంచి ఆహ్వానం.. ఈడీ విచారణకు హాజరుకాని సీఎం..!
కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు కొందరికి కలిసొస్తాయి. తాజాగా ఝార్ఖండ్ సీఎంకు కూడా అలానే జరిగింది. భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సు సందర్భంగా ఈ రోజు రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత్ కు వచ్చిన అతిథులతో పాటు దేశంలోని ప్రముఖులకు ఆహ్వానాలు అందాయు. అందుల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. రాష్ట్రపతి ఆహ్వానం అందుకున్న పలువురు సీఎంలు ఇప్పటికే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.
తాజాగా ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా విందు వెళ్తున్నట్లు చెప్పారు. విందు కారణంగా ఈడీ విచారణకు రాలేనని సోరెన్ ఈడీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కేసులో సోరెన్ ను ఈడీ విచారణకు పిలిచింది. ఆయన ఆగస్ట్ 14న విచారణకు హాజరు కావాల్సి ఉన్నా కాలేదు. ఆ తర్వాత ఆగస్టు 24న కూడా విచారణకు హాజరు కాలేదు. తాజాగా ఈడీ సెప్టెంబర్ 9 విచారణకు హాజరు కావాలని సోరెన్ కు నోటీసులు ఇచ్చింది.

అయితే రాష్ట్రపతి విందుకు ఆహ్వానం అందడంతో ఆయన ఈ రోజు కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదని సమాచారం. రాష్ట్రపతి నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆహ్వానం అందాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఆహ్వానాలు వచ్చాయి.

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మణిపూర్ సీఎం ఎన్.బీరెన్ సింగ్, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, మిజోరం సీఎం జోరంతంగా, నాగాలాండ్ సీఎం నైఫియు రియో, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, పంజాబ్ సీఎం భగవాన్ సింగ్ మాన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సిక్కిం సీఎం పీఎస్ గోలాయ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, త్రిపుర సీఎం మాణిక్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందింది.












Click it and Unblock the Notifications