• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Jharkhand Exit Poll Results 2019 Live: కాంగ్రెస్‌కే పట్టం కట్టిన రిపబ్లిక్ జన్ కీ బాత్ పోల్

|

జార్ఖండ్‌లో చివరిదశ పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల అవుతాయి. శుక్రవారం సాయంత్రం చివరి దశ పోలింగ్ ముగిసింది. మొత్తం ఐదు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఓటర్ మూడ్, ట్రెండ్స్‌తో పాటు ఇతరత్ర అంశాలను తీసుకుని రాష్ట్రంలో సర్వేలు నిర్వహించారు. జార్ఖండ్ ఎన్నికల్లో ఓటర్ నాడి ఎలాగుందో అక్కడ ఏ ప్రభుత్వం ఏర్పాటు కానుందో ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలియనుంది.

మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి నాలుగు దశల్లో 65 స్థానాలకు పోలింగ్ ముగియగా మిగతా 16 స్థానాలకు పోలింగ్ చివరి దశలో జరిగింది. చివరి దశలో హేమా హేమీలు పోటీపడ్డారు.

నవంబర్ 30వ తేదీన తొలి దశపోలింగ్ ప్రారంభం అవగా డిసెంబర్ 16వ తేదీన నాల్గవ దశ పోలింగ్ ముగిసింది. ఇక శుక్రవారం ఐదవ దశకు పోలింగ్ జరిగింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 23వ తేదీన వెలువడనున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం వన్‌ఇండియాను ఫాలో అవ్వండి.

Jharkhand Exit Poll Results 2019

Newest First Oldest First
7:18 PM, 21 Dec
బీజేపీ 22-30, జేెఎంఎం 28 సీట్లు గెలుస్తాయన్న రిపబ్లిక్ జన్ కీ బాత్
6:18 PM, 21 Dec
జేఎంఎం కాంగ్రెస్‌ల వైపే ఓటర్లు మొగ్గు చూపారని చెబుతోన్న జన్‌కీబాత్ రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్
6:17 PM, 21 Dec
జేఎంఎం కాంగ్రెస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని చెబుతోన్న జన్‌కీబాత్ రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్
6:16 PM, 21 Dec
బీజేపీ ఓట్లను ఏజేఎస్‌యూ చీల్చిందా అంటే ఔననే అభిప్రాయం వ్యక్తమవుతోంది
6:14 PM, 21 Dec
జన్‌కీబాత్ రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్
బీజేపీకి 33శాతం ఓటుషేరు, జేఎంఎం + 40శాతం ఓటు షేరు,ఏజేఎస్‌యూ 9శాతం ఓటుషేరు జేవీఎం 7శాతం ఓటుషేరు, ఇతరులకు 11శాతం ఓటుషేరు
6:04 PM, 21 Dec
జన్‌కీబాత్ రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్స్
బీజేపీకి 22 నుంచి 30 స్థానాలు; జేఎంఎం: 28-33; కాంగ్రెస్: 10-15; ఆర్జేడీ : 3-4; ఎన్సీపీ: 1; ఇతరులకు: 6-9 స్థానాల వస్తాయని చెప్పిన జన్‌కీబాత్ రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్స్
10:12 PM, 20 Dec
కాంగ్రెస్ కూటమికి 42, బీజేపీకి 29 సీట్లు గెలుచుకుంటాయని పోల్ సంస్థల అంచనా
9:46 PM, 20 Dec
జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో కీ రోల్ పోషించనున్న ఏజేఎస్‌యూ నేత సుదేశ్ మహతో, 3 నుంచి 7 సీట్లతో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించే ఛాన్స్
9:20 PM, 20 Dec
టైమ్స్ నౌ అంచనాల ప్రకారం కాంగ్రెస్ కూటమికి 44 సీట్లు, 28 సీట్లతో సరిపెట్టుకోనున్న బీజేపీ
9:13 PM, 20 Dec
జార్ఖండ్ ఎగ్జిట్ పోల్ టైమ్స్ ప్రకారం, కాంగ్రెస్, జేఎంఎం 39, బీజేపీ 28, ఆర్జేడీ 5, జేవీఎం 3, ఇతరులు 6 చోట్ల విజయమని అంచనా
9:03 PM, 20 Dec
కాంగ్రెస్, జేఎంఎం 37 శాతం ఓట్లు సాధించాయని పేర్కొన్న ఇండియా టుడే ఎగ్జిట్ పోల్, బీజేపీకి 34 శాతం, ఏజేఎస్‌యూకు 9శాతం, జేవీఎంకు 6 శాతం ఓట్లు, ఇతరులకు 14 శాతం వచ్చినట్టు అంచనా
8:18 PM, 20 Dec
బీజేపీతో కలిసేందుకు సిద్ధం
బీజేపీతో కలిసేందుకు సిద్ధం.. మాకు ఆ పార్టీపై వ్యతిరేకత లేదు.. అవసరమైతే బీజేపీతో అధికారం పంచుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు.. ఏజేఎస్‌యూ చీఫ్ సుదేశ్ మహతో
8:16 PM, 20 Dec
బీజేపీదే అధికారం.. జార్ఖండ్ సీఎం
ఎగ్జిట్‌ పోల్స్‌ను తోసిపుచ్చిన సీఎం రఘుబర్ దాస్... బీజేపీ అధికారంలో రావడం తథ్యమని కామెంట్
7:57 PM, 20 Dec
కషిష్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
కషిష్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
కాంగ్రెస్ కూటమికి 37 నుంచి 49 సీట్లు జేఎంఎంకు 25-30 సీట్లు, కాంగ్రెస్కు 10-15 సీట్లు, ఆర్జేడీకి 02-04 సీట్లు
7:46 PM, 20 Dec
ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం
ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం
కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమికి 38 నుంచి 50 సీట్లు.. 37 శాతం ఓట్లు బీజేపీ కూటమికి 22 నుంచి 32 సీట్లు.. 34 శాతం ఓట్లు ఏజేఎస్‌యూ పార్టీకి 3 నుంచి 5 సీట్లు.. 9 శాతం ఓట్లు జేవీఎంకు 2 నుంచి 4 శాతం.. 6 శాతం ఓట్లు ఇతరులకు 4 నుంచి 7 సీట్లు..
7:29 PM, 20 Dec
సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..
హంగ్ దిశగా జార్ఖండ్ అసెంబ్లీ.. కాంగ్రెస్ కూటమికి 35 సీట్లు, బీజేపీ కూటమికి 32 సీట్లు, ఇతరులకు 14 సీట్లు (జార్ఖండ్ వికాస్ మోర్చాకు 3, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు 5 సీట్లు)
7:20 PM, 20 Dec
12489 మందితో
12489 మంది నుంచి సేకరించిన సమాచారంతో ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. మొత్తం శాంపుల్ సైజ్‌లో 76 శాతం పురుషులు, 24 శాతం మహిళలను ఎగ్జిట్ పోల్స్ కోసం శాంపిల్‌గా తీసుకొన్నారు.
7:15 PM, 20 Dec
మెజారిటీ దిశగా కాంగ్రెస్ కూటమి
జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి 31-39 సీట్లు వచ్చే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ అంచనా
7:13 PM, 20 Dec
ఐఏఎన్ఎస్, సీ ఓటర్, ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.
ఐఏఎన్ఎస్, సీ ఓటర్, ఏబీపీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.
బీజేపీ కూటమికి 28-36 సీట్లు, కాంగ్రెస్‌కు 31-39 సీట్లు, జేవీఎంపీకి 1-4, ఏజేఎస్‌యూ 3 - 7 సీట్లు
6:57 PM, 20 Dec
2014 ఎన్నికల్లో
2014 ఎన్నికల్లో బీజేపీకి 37 స్థానాలు, కాంగ్రెస్ 6 సీట్లు, ఇతరలకు మొత్తం 38 సీట్లు
6:54 PM, 20 Dec
బీజేపీ ప్రభుత్వానికి షాక్.. ఓటమి పాలయ్యే అవకాశం
డెమోక్రసి టైమ్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. జార్ఖండ్‌లో రఘుభర్ దాస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఓటమి పాలయ్యే అవకాశం
6:02 PM, 20 Dec
ముగిసిన ఐదో విడత ఎన్నికల పోలింగ్
ముగిసిన ఐదో విడత ఎన్నికల పోలింగ్.. 40,05,287 మంది ఓటు హక్కును ఉపయోగించుకోగా, 19,55,336 మంది మహిళలు, 30 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
5:58 PM, 20 Dec
కాసేపట్లో ఎగ్గిట్ పోల్స్
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై 6 గంటల తర్వాత టెలివిజన్, మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్
1:09 PM, 20 Dec
మొత్తం 81 స్థానాల కోసం జరిగిన పోలింగ్‌కు సంబంధించి ఈ రోజు (డిసెంబర్ 20 తేదీ) సాయంత్రం 5 గంటలకు పలు టెలివిజన్ ఛానెళ్లు, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించనున్నాయి.
1:06 PM, 20 Dec
ఓటర్ నాడి ఎలాగుందో తెలపనున్న ఎగ్జిట్ పోల్స్
1:06 PM, 20 Dec
నవంబర్ 30న ప్రారంభమైన తొలిదశ పోలింగ్.. డిసెంబర్ 20తో ముగియనున్న చివరిదశ పోలింగ్
1:06 PM, 20 Dec
డిసెంబర్ 23న వెలువడనున్న జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
1:06 PM, 20 Dec
జార్ఖండ్ ఎన్నికల్లో వాడీ వేడీగా సాగిన అధికార ప్రతిపక్షాల ప్రచారం
1:05 PM, 20 Dec
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి వరకు 5 విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఫలితాలు డిసెంబర్ 23న వెల్లడికానున్నాయి.

English summary
Fifth and final phase of polling continues in Jharkhand state. Polling will end at 5PM in the evening after which there will be a flow of exit polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X