నెక్స్ట్ లెవెల్: పెట్రోల్‌పై ఏకంగా రూ.25 తగ్గింపు: ముఖ్యమంత్రి తాజా ప్రకటన: అక్కడే ట్విస్ట్

రాంచీ: సుమారు మూడు నెలల పాటు వాహనదారులకు చుక్కలు చూపించిన పెట్రోల్, డీజిల్ ధరలు కొంత శాంతించాయి. ఇంధన రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్న దశలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. పెట్రోల్‌పై లీటర్ ఒక్కింటికి అయిదు రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయల మేర కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. దీపావళి కానుకగా వాటి రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని దాదాపు అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి. అప్పటి నుంచీ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటోన్నాయి.

భారీగా తగ్గింపు..

భారీగా తగ్గింపు..

తాజాగా ఈ తగ్గింపు అనేది నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. అదీ- కాంగ్రెస్ మిత్రపక్షం అధికారంలో ఉన్న రాష్ట్రంలో. పెట్రోల్‌పై లీటర్ ఒక్కింటికి ఏకంగా 25 రూపాయలను తగ్గించింది. ఈ తగ్గింపు.. దేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకుని రానుంది అక్కడి ప్రభుత్వం. ఆ రాష్ట్రం- జార్ఖండ్. కాంగ్రెస్ మిత్రపక్షం జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారంలో ఉందక్కడ. పెట్రోల్ రేట్ల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు.

రైతులు, చిరు వ్యాపారులు..

రైతులు, చిరు వ్యాపారులు..

కొద్దిసేపటి కిందటే రాజధాని రాంచీలో ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ తగ్గింపు అనేది ద్విచక్ర వాహనాలకు మాత్రమే వర్తింపజేస్తున్నట్లు హేమంత్ సోరెన్ తెలిపారు. మిగిలిన వాహనాలతో పోల్చుకుంటే ద్విచక్ర వాహనాలు అధిక మొత్తంలో పెట్రోల్‌ను వినియోగిస్తున్నాయని చెప్పారు. ద్విచక్ర వాహనాలను వినియోగించుకునే వారిలో రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబీకులు టూవీలర్స్‌ను వాడుతున్నారని, పాల విక్రేతలు, చిరు వ్యాపారులు దీనిపై ఆధారపడ్డారని అన్నారు.

డీలర్ల డిమాండ్ మేరకు..

డీలర్ల డిమాండ్ మేరకు..

వారిపై భారాన్ని తగ్గించేలా పెట్రోల్‌పై 25 రూపాయలను తగ్గించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలంటూ జార్ఖండ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ల ప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తోన్నారు. పొరుగున బిహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలల్లో పెట్రోల్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల సరిహద్దు ప్రజలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేస్తోన్నారని, వాటికి సమానంగా ధరలను తగ్గించాలనే డిమాండ్ వినిపిస్తోన్నారు.

టూవీలర్స్‌కు..

టూవీలర్స్‌కు..

వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తాజాగా ప్రకటన చేశారు. పెట్రోల్‌పై లీటర్ ఒక్కటింకి 25 రూపాయలను తగ్గించనున్నామని, ద్విచక్ర వాహనాలకు మాత్రమే దీన్ని వర్తింపజేయనున్నామని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం నాటి నుంచి అమల్లోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ పేద, మధ్య తరగతి కుటుంబీకుల సంక్షేమానికి పాటుపడుతుందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు దీన్ని అమలు చేయగలవా? అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+