Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జియాఖాన్ మృతి కేసులో 'అమెరికా ఎఫ్‌బిఐ' ట్విస్ట్

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. సిబిఐ దర్యాప్తు చేసిన ఈ కేసులో జియా ఆత్మహత్య చేసుకుందని పేర్కొనడంపై ఆమె తల్లి రబియా ఖాన్ బాంబే కోర్టులో తాజాగా పిటిషన్ వేశారు.

ఆమె హత్యకు గురైతే సిబిఐ ఆత్మహత్యకు గురైందని పేర్కొందని ఆమె పిటిషన్లో తెలిపారు. జియాఖాన్ అమెరికాలో పుట్టినందున ఈ కేసును ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కి (ఎఫ్‌బిఐ)అప్పగించాలని ఆమె పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

Jiah Khan suicide: Want FBI to step in as Jiah was US citizen, says mom

కేసును ఇన్ని రోజులు వాయిదా వేసేందుకు సహకరించిన పోలీసుల పైనా చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును కోరారు. ఈ కేసులో సూరజ్ పంచోలీ హస్తం ఉందా? లేదా? అనేది తేల్చకుండా సిబిఐ కేసును మూసివేసిందని ఆరోపించారు.

నిజానికి పిటిషన్ వేసిన వారిని, అమెరికా కాన్సులేట్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె అన్నారు. కాగా, ఈ పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది. జియాఖాన్ జూన్ 3, 2013లో తన ఇంటిలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+