Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాశ్మీర్ ఓటర్లు గ్రేట్- ఒక ఓటుకు ఒక మొక్క

Jammu Kashmir Assembly election 2024: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు ఆరంభమైన పోలింగ్- సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూలైన్‌లో వేచివున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు ఎన్నికల సిబ్బంది.

దశాబ్ద కాలం తరువాత జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం మూడు దశల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నెల 18వ తేదీన తొలిదశ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. రెండో విడతలో ఆరు జిల్లాల్లో మొత్తం 26 నియోజకవర్గాల్లో పోలింగ్ ఊపందుకుంది.

JK Assembly polls 2024 2nd Phase Polling turnout recorded till 9 am as 10 22 percentage

ఇక్కడ ఉన్న మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య.. 90. కంగన్, గందర్‌బల్, హజ్రత్‌బాల్, ఖన్యార్, హబ్బకదల్, లాల్‌చౌక్, ఛన్నాపోరా, జడీబాల్, ఈద్గా, సెంట్రల్ షాల్టెంగ్, బుద్గామ్, బీర్వా, ఖాన్‌సాహిబ్, చాహర్-ఐ-షరీఫ్, చదూరా, గులాబ్‌ఘర్, రియాసి, శ్రీ మాతా వైష్ణో దేవి, కాలాకోటే-సుందర్‌బని, నౌషేరా, రాజౌరి, బుధాల్, థన్నామండీ, సురాన్‌కోట్, పూంచ్ హవేలీ, మెంధార్‌లలో పోలింగ్ కొనసాగుతోంది.

మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తోన్న రెండు నియోజకవర్గాలు- గందర్‌బాల్, బుద్గాంలల్లో పోలింగ్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా.. నౌషేరా నుంచి పోటీలో ఉన్నారు.

ప్రతిష్ఠాత్మకమైన శ్రీ మాతా వైష్ణో దేవి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బల్‌దేవ్ రాజ్ శర్మ పోటీలో నిలిచారు. అప్పీ పార్టీ అధినేత అల్తాఫ్ బుఖారీ- ఛన్నాపొరా, పీసీసీ అధినేత తారిఖ్ హమీద్ కర్రా- షాల్టాంగ్, మాజీ మంత్రులు, నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులు అలీ సాగర్- ఖన్యార్, రహీం రాథర్- చాహర్ ఐ షరీఫ్.. భవితవ్యం నేడే తేలిపోనుంది.

JK Assembly polls 2024 2nd Phase Polling turnout recorded till 9 am as 10 22 percentage

ఉదయం 9 గంటల వరకు 10.22 శాతం మేర పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పోలింగ్ రికార్డయిన జిల్లాల్లో పూంఛ్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ తొలి రెండు గంటల్లో 14.41 శాతం మేర పోలింగ్ జరిగింది. రియాసీ- 13.37, రాజౌరీ- 12.71, గందర్‌బాల్- 12.61, బుడ్గాం- 10.91 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా శ్రీనగర్‌లో కేవలం 4.70 శాతమే రికార్డయింది.

కాగా పలుచోట్ల ఓటర్లు మొక్కలు నాటడం అందరి దృష్టినీ ఆకర్షించింది. గందర్‌బాల్ నియోజకవర్గం పరిధిలోని బగూ రాంపొర, జమ్మూలోని నార్తర్న్ జోనల్ అకౌంటెన్సీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కొందరు ఓటర్లు మొక్కలు నాటారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని వాళ్లు విజ్ఞప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+