Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీవీ నటి అమ్రీన్ భట్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్: 3 రోజుల్లో 10 మంది హతం

శ్రీనగర్: టీవీ నటి, సోషల్ మీడియాలో పాపులర్ అయిన అమ్రీన్ భట్ హంతకులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆమె హత్య జరిగిన 24 గంటల్లోనే భద్రతా దళాలు వారిని ఎన్‌కౌంటర్ చేశాయి. జమ్మూకాశ్మీర్‌ అవంతిపొరాలోని అగన్‌హజిపొరాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిద్దరూ స్థానిక ఉగ్రవాదులేనని పోలీసులు తెలిపారు.

వీరిలో షాహిద్ ముస్తాక్ భట్ బుద్గాం వాసి కాగా, మరో ఉగ్రవాది ఫర్హాన్ హబీబ్ పుల్వామాలో హికింపొరా వాసిగా గుర్తించారు. వీరిద్దరు టీవీ నటి అమ్రీన్ హత్యలో ప్రధాన నిందితులని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక ఏకే 56 రైఫిల్, నాలుగు మ్యాగ్జైన్లు, ఒక పిస్తోల్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరు ఉగ్రవాదులుగా మారిన తర్వాత అమ్రీన్ ను కాల్చి చంపారు.

మరోవైపు, శ్రీనగర్‌లోని సౌర ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దీంతో మొత్తం మూడు రోజుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి. వీరిలో ముగ్గురు జైషే మహమ్మద్‌కు చెందినవారు కాగా, ఏడుగురు లష్కరే ఉగ్రవాదులు ఉన్నారని తెలిపారు.

టీవీ నటి ఉమ్రీన్ భట్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలోని చదూరాలోని హిష్రూ ప్రాంతంలో బుధవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో టీవీ నటి అమ్రీన్ భట్, ఆమె మేనల్లుడు గాయపడ్డాడు.

అమ్రీన్ భట్ అనే బాధితురాలిని ఆమె ఇంటి బయట కాల్చారు. ఆమె 10 ఏళ్ల మేనల్లుడు చేతికి తుపాకీ గాయం తగిలింది. అయితే అతని పరిస్థితి నిలకడగా ఉంది.అమ్రీన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

 JK: LeT terrorists, who murdered TV artist Amreen Bhat, shot dead in encounter in Awantipora

లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని ఖండిస్తూ ట్విటర్‌లో పేర్కొన్నారు. 'అమాయక మహిళలు, పిల్లలను ఈ విధంగా లక్ష్యంగా చేసుకోవడం సమర్థించబడదు' అని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+