వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉమర్ ఖలీద్‌కు బెయిల్ మంజూరు -ఢిల్లీ అల్లర్ల కేసులో జేఎన్‌యూ మాజీ నేతకు ఊరట

|
Google Oneindia TeluguNews

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ నేత ఉమర్ ఖలీద్‌కు బెయిల్ మంజూరైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ గతేడాది ఢిల్లీలో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో అరెస్టైన ఉమర్ ఖలీద్.. 200రోజులుపైగా జైలులోనే ఉన్నారు. పలు ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు ఢిల్లీ కోర్టు గురువారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

తిరుపతి: పవన్ కల్యాణ్ ఆఖరి అస్త్రం -లౌకిక సిద్ధాంతం -కరోనా వార్నింగ్ -బీజేపీ రత్నప్రభ ఎందుకంటేతిరుపతి: పవన్ కల్యాణ్ ఆఖరి అస్త్రం -లౌకిక సిద్ధాంతం -కరోనా వార్నింగ్ -బీజేపీ రత్నప్రభ ఎందుకంటే

ఢిల్లీ సహా దేశమంతటా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోన్న కారణంగా జైలు నుంచి విడుదలైన అనంతరమే ఫోన్‌లో ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని ఖలీద్ కు కోర్టు షరతు విధించింది. ఈ కేసులో ఇతర నిందితులను అరెస్ట్ చేసేవరకు ఉమర్ ను జైల్లోనే ఉంచాలన్న ఢిల్లీ పోలీసుల వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇతర నిందితులు అరెస్టయ్యేదాకా అతణ్ని జైలులో మగ్గిపోయేలా చేయకూడదని బెయిల్ మంజూరు చేసే సమయంలో కోర్టు పేర్కొంది.

 JNU former student leader Umar Khalid Gets Bail In Delhi Riots Case

సీఏఏ నిరసనలు హింసాత్మక మలుపు తీసుకోవడం, గతేడాది ఫిబ్రవరి 24న ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. కాగా, ఈ అల్లర్లు జరగడంలో ఉమర్ ఖలీద్ హస్తం ఉందనే కారణంతో అక్టోబర్‌లో అతడిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసు క్రైం బ్యూరో నమోదు చేసిన చార్జ్‌షీట్‌లో ఉమర్ ఖలీద్‌ను నిందితుడిగా చేర్చారు. అనంతరం అతడిపై ఉపా చట్టం ప్రకారం కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఢిల్లీలో జరిగిన ఈ అల్లర్లలో 50 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు.

శభాష్ అచ్చెన్న! -17న వైసీపీలో చేరికా? -విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు-జగన్ పెట్టుబడి రహస్యం ఇదేశభాష్ అచ్చెన్న! -17న వైసీపీలో చేరికా? -విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు-జగన్ పెట్టుబడి రహస్యం ఇదే

English summary
Activist and former student leader Umar Khalid was granted bail by a Delhi court today in a case linked to the Delhi riots last year. He has been asked by the court to install the Aarogya Setu on his phone before leaving prison at a time Covid cases are spiraling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X