వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ ఆర్మీపై కన్నయ్య కుమార్ తీవ్ర వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టెర్రరిస్ట్ అఫ్జల్ గురుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) విద్యార్థి కన్నయ్య కుమార్ మరోసారి వర్సిటీలో వివాదాస్పద ప్రసంగం చేశాడు. భారత సైన్యం పైన తీవ్ర, దారుణమైన వ్యాఖ్యలు చేశాడు.

దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైన్యంపై అతడు ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాశ్మీర్ మహిళలపై భారత సైనికులు అత్యాచార పరంపర సాగిస్తున్నారని అతడు ఆరోపించాడు. మంగళవారం ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతను మాట్లాడాడు.

JNU row: Now Kanhaiya Kumar says Indian Army rapes women in Kashmir

ఈ సందర్భంగా అతను పైవ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, కాశ్మీర్‌లో ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ (ఏఎఫ్ఎస్పీఏ)కు వ్యతిరేకంగా గళం ఎత్తుతానని కూడా అతను వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది.

పార్లమెంటుపై జరిగిన దాడిలో దోషిగా తేలి ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురుకు మద్దతుగా.. వర్సిటీలో విద్యార్థులు గత నెల 9 వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న కారణంగా వర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ పై దేశద్రోహం కింద కేసు నమోదైంది. ఇటీవలి వరకు జైల్లో గడిపిన అతడు నాలుగు రోజుల క్రితం విడుదలయ్యాడు.

English summary
Jawaharlal Nehru University Students' Union president Kanhaiya Kumar who is facing sedition charges for making anti-India slogan in university campus, has stoked fresh round of controversy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X