జేఎన్‌యూ విద్యార్థులు, జర్నలిస్టులపై దాడి
న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అఫ్జల్‌గురుకు అనుకూలంగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న దేశద్రోహం కేసు విచారణకు వచ్చినపుడు కోర్టుకు వచ్చిన జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బందిపై దాడి జరిగింది.
‘లాంగ్‌లివ్ ఇండియా, డౌన్ డౌన్ జేఎన్‌యు' అని నినాదాలు చేసిన న్యాయవాదులు విద్యార్థులను కోర్టు బయటకు నెట్టేశారు. కాగా, విద్యార్థులు, మీడియా ప్రతినిధులపై పాటియాలా హౌస్ కోర్టు వద్ద న్యాయవాదులు దాడి చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
జేఎన్‌యూ వివాదంలో దేశద్రోహం కేసులో అరెస్టయిన స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో పాటియాలా హౌస్ కోర్టుకు వెళ్లిన విద్యార్థులు, పలువురు జర్నలిస్టులపై దాడి జరిగింది. లాయర్లే దాడికి పాల్పడినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
న్యాయవాదులు భారత్‌కు మద్దతుగా, జేఎన్‌యూకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు లోపల ఉన్నవారిని బయటకు వెళ్లమని కోరడంతో లాయర్లకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.
జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులపై కూడా లాయర్లు దాడి చేసినట్లు చెబుతున్నారు. దాడికి పాల్పడిన లాయర్లు భాజపాకు మద్దతిచ్చేవారని, పోలీసులు చూస్తూ ఊరుకున్నారు తప్ప దాడిని అడ్డుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. పలువురు విద్యార్థులు, జర్నలిస్టులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.
కన్నయ్యకుమార్ కస్టడీ పొడగింపు
దేశద్రోహం కేసులో గతవారం అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కస్టడీని మరో రెండు రోజులు పొడిగించారు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో సోమవారం కన్నయ్యను హాజరుపరిచారు.
కేసు పూర్వాపరాలను విచారించిన న్యాయస్థానం కస్టడీని రెండు రోజుల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. మరోవైపు ఈ కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను స్వీకరించిన దిల్లీ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.












Click it and Unblock the Notifications