రాహుల్ గాంధి రోడ్ షోలో జర్నలిస్టులకు గాయాలు, గాయపడిన జర్నలిస్టులకు చికిత్స చేసిన రాహుల్
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి వయానాడ్ పార్లమెంట్ నియోజవర్గం లో నిర్వహించిన ర్యాలీలో పలువురు జర్నలిస్టులకు గాయాలు అయ్యాయి. కాగా ఆయన నిర్వహించిన ర్యాలీలో భారీకేడ్స్ వల్ల ఈ ప్రమాదం జరిగింది.
అయితే గాయపడిన జర్నలిస్టులను దీంతో వెంటనే రాహుల్ గాంధి కాన్వాయ్ లోని అంబులెన్స్ లోక తరలించారు. అనంతరం అంబులెన్స్ లో ఉన్న ఏఎన్ఐ జర్నలిస్టుకు తలకు రక్తం కారుతుండడంతో కాటన్ తో జర్నలిస్టు తలను రక్తం కారకుండా రాహుల్ గాంధి క్లీన్ చేయడం అందరిని అశ్చర్యానికి గురిచేసింది.

కాగా జర్నలిస్టులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా గాయపడిన జర్నలిస్టుల్లో ఏఎన్ఐతో పాటు స్థానిక రిపోర్టర్లు ఉన్నారు.












Click it and Unblock the Notifications