తాత మళ్లీ పుట్టాలి: ఎన్టీఆర్, అప్పుడే నివాళి: హరి
హైదరాబాద్: తమ తాత ఎన్టీ రామారావు మళ్లీ జన్మించాలని కోరుకుంటున్నట్లు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. తన తండ్రి హరికృష్ణ, కళ్యాణ్ రామ్, తారకరత్న, దర్శకుడు వైవియస్ చౌదరితలతో కలిసి ఆయన బుధవారం ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన నివాళులు అర్పించారు.
తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఒక్కటిగా కలిసి ఉండడమే ఎన్టీ రామారావుకు నిజమైన నివాళి అని తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు, ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ అన్నారు. ఇరు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని ఆయన అన్నారు. ఎన్టీఆర్ జయంతిని ప్రజలు పండుగలా జరుపుకోవాలని ఆయన అన్నారు.

ఎన్టీ రామారావు దేశ అత్యున్నత పురష్కారం భారతరత్న ఇవ్వాలని ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి డిమాండ్ చేశారు. నందమూరి తారకరామారావు 91వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం నివాళులర్పించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణ, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు. బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications