వ్యాక్సినేషన్‌పై కేంద్రం చేసిన ఆ ప్రకటన వట్టి బూటకం... : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం చేస్తున్న ప్రకటనలు వట్టి బూటకమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు. దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ ఈ ఏడాది డిసెంబర్ నాటి కల్లా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్రం చెబుతున్న మాటల్లో నిజం లేదన్నారు. దానికి ఎటువంటి ప్రాతిపదిక లేదని... ఆ మాటలు వట్టి బూటకమని పేర్కొన్నారు. రాష్ట్రాలకు కేంద్రమే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

'దేశంలో డిసెంబర్ నాటికి అర్హులైన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఇదంతా వట్టి బూటకం. బిహార్ ఎన్నికలకు ముందు ఇలానే చెప్పారు. తమను గెలిపిస్తే ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని. కానీ అక్కడ అలాంటిదేమీ లేదు.' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. వ్యాక్సిన్ డోసుల మధ్య ఇప్పుడున్న వ్యవధి ప్రకారం దేశంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుందన్నారు.

Just a hoax: Mamata on Centres claim to vaccinate all citizens by Dec-end

వ్యాక్సిన్ల కోసం ఇప్పటివరకూ తమ ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 10 కోట్ల జనాభా ఉన్న తమ రాష్ట్రానికి ఇప్పటివరకూ వచ్చింది కేవలం 1.4 కోట్ల వ్యాక్సిన్ డోసులేనని చెప్పారు. కేంద్రం అసలు రాష్ట్రాలకు వ్యాక్సిన్ స్టాక్ పంపించట్లేదన్నారు. ఏదో కొద్ది మొత్తంలో స్టాక్ పంపిస్తే అది కొద్దిరోజుల్లోనే అయిపోతోందన్నారు. ఇప్పటికైనా కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ మంగళవారం(జూన్ 1) మాట్లాడుతూ... దేశంలో ఈ ఏడాది జులై మధ్య నాటికి లేదా అగస్టు మొదటి వారానికి రోజుకు కోటి వ్యాక్సిన్ డోసులను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అర్హులైన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. గతంలో కేంద్రం కూడా ఇదే ప్రకటించింది.దేశంలో ఈ ఏడాది అగస్టు-డిసెంబర్ నాటికి 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. ఇందులో 75 కోట్లు కోవీషీల్డ్,55 కోట్లు కోవాగ్జిన్ డోసులతో పాటు జైదుస్ క్యాడిలా,నోవావాక్స్,స్పుత్నిక్ వ్యాక్సిన్ ఉన్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి దేశంలో 300 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే అనుమతి పొందిన మూడు వ్యాక్సిన్లతో పాటు ప్రయోగ దశల్లో ఉన్న వివిధ వ్యాక్సిన్ కంపెనీల నివేదికలను బట్టి ఈ అంచనాలను రూపొందించినట్లు స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+