హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాముడ్ని, కృష్ణుడ్ని పూజిస్తే సరిపోదు: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల కార్యకర్త కైలాశ్ సత్యార్థి స్పందించారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

Disha murder : దిశ ఆత్మ శాంతించిందన్న కుటుంబం ..ఆ మానవ మృగాల శవాలు చూడాలని వుందన్న తల్లిDisha murder : దిశ ఆత్మ శాంతించిందన్న కుటుంబం ..ఆ మానవ మృగాల శవాలు చూడాలని వుందన్న తల్లి

Recommended Video

Disha Issue : From President To Politicians And Sports Personalities & Celebrities | Oneindia Telugu

ట్విట్టర్ వేదికగా..

రాముడ్ని, కృష్ణుడ్ని పూజించడమే కాదు.. నేటి యుగంలో ఆ అవతారాలు కూడా ఎత్తాల్సిందేనని కైలాశ్ సత్యార్థి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

రాముడ్ని, కృష్ణుడ్ని పూజిస్తే సరిపోదు..

రాముడ్ని, కృష్ణుడ్ని పూజిస్తే సరిపోదు..


‘త్రేతాయుగంలో రావణుడు, ద్వాపరయుగంలో దుశ్శాసనుడు మన బిడ్డలను కేవలం ఎత్తుకెళ్లారు. కానీ, నేటి యుగంలో రాక్షసులు మన సీతలను, ద్రౌపదులను ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి తగలబెడుతున్నారు. అలాంటప్పుడు రాముడిలా, కృష్ణుడిలా మారకుండా ఎంతకాలమని వారిని పూజిస్తూ ఉంటాం' అని కైలాశ్ సత్యార్థి స్పష్టం చేశారు.

27న దారుణం.. అక్కడే..

27న దారుణం.. అక్కడే..

కాగా, దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులైన మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను శుక్రవారం తెల్లవారుజామున సైబరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 27న దిశను నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టారు. మృతురాలు హత్యకు గురైన ఛాటాన్‌పల్లి వంతెన వద్దే నిందితులు కూడా ఎన్‌కౌంటర్‌కు గురికావడం గమనార్హం.

సీన్ రీ కన్‌స్ట్రక్చన్ చేసే సమయంలోనే..

సీన్ రీ కన్‌స్ట్రక్చన్ చేసే సమయంలోనే..


సీన్ రీ కన్‌స్ట్రక్చన్ కోసం నిందితులను ఘటనా స్థలికి తీసుకెళ్లిన క్రమంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. దిశను సజీవదహనం చేసిన ఘటనా స్థలంలో పోలీసులపై పోలీసులపై దాడి చేసి.. పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు నిందితులు మృతి చెందారు. దిశ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా నిందితులను వెంటనే ఉరితీయాలంటూ నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ రాజధానిలోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. పార్లమెంటునూ దిశ ఘటన కుదిపేసింది. దేశంలో ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలంటూ సభ్యులు డిమాండ్ చేశారు. నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ పోలీసులపై నలువైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
Nobel peace prize awardee Kailash Satyarthi on disha accused encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X