పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు.. ఒకరు మృతి, 8 మందికి గాయాలు

బెంగళూరు నుంచి కామాఖ్య (గౌహతి) వెళ్తున్న కామాఖ్య ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు (12551) ప్రమాదానికి గురైంది. కటక్-నెర్గుండి రైల్వేస్టేషన్ల మధ్య ఈ రైలు పట్టాలుతప్పింది. మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పడంతో ఒకరు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. అయితే, రైలు వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డీఎం దత్తాత్రేయ బహుసాహెబ్ శిండే తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలైనట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆదివారం ఉదయం 11.54 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్వో అశోక్ కుమార్ మిశ్రా తెలిపారు.

Kamakhya Express train derails one dead 8 injured

కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురికావడంతో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని సురక్షితంగా తరలించేందుకు అధికారులు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ఈ రైలు భువనేశ్వర్ నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు బయల్దేరి వెళ్లినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది.

భువనేశ్వర్: 7205149591, 8114382371, 8455885999
కటక్: 8991124238, ఖుర్దా రోడ్: 06742492245
భద్రక్: 9437443469, జాజ్పూర్ కియోంజార్ రోడ్డు: 9124693558

ఈ రైలు ప్రమాద ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. ఒడిశా ప్రభుత్వం, రైల్వే అధికారులతో టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. గాయపడినవారిలో అస్సాంకు చెందిన ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. వారిద్దరికీ ప్రాణాపాయం ఏమీ లేదని, ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+