వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎటువైపు అడుగు వేస్తున్నారు: కమల్ హాసన్ కథ ఏమిటి?

|
Google Oneindia TeluguNews

చెన్నై: జాతీయ ఉత్తమ నటుడు, సకలకళావల్లవన్ కమల్ హాసన్ రాజకీయాల్లో తన కళను ప్రదర్శించనున్నారా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ ప్రశ్నకు జవాబు ఊతమిచ్చే విధంగా ఆదివారం ఆయన తన అభిమాన సంఘాల నాయకులతో ఉదయం నుంచి రాత్రి వరకు తీరికలేకుండా గడిపారు.

బాహుబాషా నటుడు కమల్ హాసన్ ఇటీవల కాలంలో తరచూ రాజకీయ విమర్శలు, పలు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ముఖ్యంగా జయలలిత మరణించిన తరువాత కమల్ హాసన్ వ్యవహారశైలిలో స్పష్టమైన మార్పులు కనపడుతున్నాయి. కమల్ హాసన్ వైఖరిలో మార్పులు రావడంతో ఆయన అభిమానులు ఉల్లాసంగా సమాజ సేవ వైపు ముందడగు వేస్తున్నారు.

ఉదయం నుంచి రాత్రి వరకు

ఉదయం నుంచి రాత్రి వరకు

చెన్నైలోని అళ్వార్ పేటలోని ఎల్డామ్స్ రోడ్డులోని కమల్ హాసన్ కార్యాలయంలో ఆయన అభిమాన సంఘాల నాయకులు ఆదివారం ఉదయం 10 గంటలకు సమావేశం అయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు కమల్ హాసన్ తీరకలేకుండా గడిపారు. ఈ సందర్బంలో పలు విషయాలపై కమల్ హాసన్ తన అభిమాన సంఘాల నాయకులకు సూచనలు, సలహాలు ఇచ్చారని తెలిసింది.

కమల్ హాసన్ ను కలిసిందే ఎవరంటే ?

కమల్ హాసన్ ను కలిసిందే ఎవరంటే ?

కమల్ హాసన్ సంక్షేమ సంఘం, కమల్ హాసన్ అభిమాన సంఘాలకు చెందిన పలువురు న్యాయవాదులు ఆదివారం సమావేశం అయ్యారు. ఇదే సమయంలో కమల్ హాసన్ సంఘం కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. సంఘం నేతలకు కమల్ హాసన్ పలు సూచనలు సలహాలు ఇచ్చారు. భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాల గురించి అభిమాన సంఘాల నేతలతో చర్చించరని వెలుగు చూసింది.

మీడియాను దూరం పెట్టిన కమల్

మీడియాను దూరం పెట్టిన కమల్

ఈ సమావేశంలో రాజకీయల గురించి పెద్దగాచర్చకు రాలేదని కమల్ అభిమాన సంఘం నాయకుడు స్థానిక మీడియాకు చెప్పారు. ప్రస్తుతానికి మీడియాను కలిసే ఆలోచన కూడా కమల్ హాసన్ కు లేదని ఆయన అన్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఉదయం నుంచి రాత్రి వరకు కమల్ హాసన్ కార్యాలయం దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

కమల్ అభిమాన సంఘం నేత అరెస్టు

కమల్ అభిమాన సంఘం నేత అరెస్టు

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ పగ్గాలు చేపట్టడానికి ప్రయత్నించిన సమయంలో కమల్ హాసన్ తీవ్రస్థాయిలో స్పందించారు. పన్నీర్ సెల్వంకు మద్దతుగా మాట్లాడారు. ఎడప్పాడి పళనిసామి ముఖ్మమంత్రి అయిన సమయంలో కమల్ స్పందించారు. తన అభిమాన నటుడి వ్యవహారశైలికి అనుగుణంగా విమర్శలు చేసిన కమల్ అభిమాన సంఘం నాయకుడు కటకటాల పాలైయ్యాడు. అభిమాన సంఘం నేతను అరెస్టు చెయ్యడంతో కమల్ తీవ్రంగా ఖండించారు.

అడుగులు ఎటు వేస్తారు ?

అడుగులు ఎటు వేస్తారు ?

రాష్ట్ర రాజకీయాలపై, ప్రజా సమస్యలపై గతంలో ఎన్నడూ అంతగా స్పందించని కమల్ హాసన్ అకస్మాత్తుగా తన ధోరణి మార్చుకోవడం వెనుకు బలమైన అంతరార్థం ఉందని తమిళనాడు ప్రజలు భావిస్తున్నారు. గతంలో మీరు రాజకీయాల్లోకి వస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తనకు రాజకీయాలు తెలియవు, అందులో ప్రవేశించాలనే ఆలోచనకూడా లేదని, ప్రజల మేలుకోరుతూ మాట్లాడుతున్నానని కమల్ హాసన్ సమాధాం ఇచ్చారు.

ఆట మొదలైయ్యింది

ఆట మొదలైయ్యింది

విశ్వరూపం సినిమా విడుదల అడ్డుకుంటూ జరిగిన రాజకీయ పరిణామాలపై విసుగు చెందిన కమల్ హాసన్ తాను తమిళనాడులో నివసించనని, దేశం విడిచి వెళ్లిపోతానని బహిరంగంగా ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే ఇప్పుడు ఆయనలో ఎక్కడలేని మార్పులు రావడంతో పలు పార్టీల నాయకులు కమల్ హాసన్ ను తమ పార్టీలో చేర్చుకోవడానికి పావులు కదుపుతున్నారు. అయితే కమల్ హాసన్ కొత్త పార్టీ పెడుతారా ? ఎదైనా పార్టీ తీర్థం పుచ్చుకుంటారా ? అనే విషయం ఆయన అభిమాన సంఘాల నాయకులు బయటకు చెప్పడం లేదు.

English summary
Latest reports emerging from Chennai indicate that Kamal Haasan is expected to take a positive decision on entering politics. It's buzzed that Kamal Haasan is going to convene a meeting with his fans about his next big step.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X