లోక్ సభ ఎన్నికలకు యూనివర్శల్ హీరో దూరం, ప్రతిభావంతులు ఉన్నారు: కమల్ హాసన్ !

చెన్నై: అభిమానులతో యూనివర్శల్ స్టార్ అని పిలిపించుకుంటున్న హీరో, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ చీఫ్ కమల్ హసన్ లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యకూడదని కమల్ హాసన్ నిర్ణయించారు. ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తున్నామని కమల్ హాసన్ చెప్పారు.

తమిళనాడులోని లోక్ సభ నియోజక వర్గాలకు, 18 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మక్కల్ నీది మయ్యమ్ పార్టీ ప్రకటించింది. ప్రతి లోక్ సభ నియోజక వర్గం, 18 శాసన సభ నియజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉందని, తనకంటే ఎక్కువ ప్రతిభావంతులు పోటీకి సిద్దం అయ్యారని, అందుకే తాను ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని కమల్ హాసన్ తెలిపారు.

Kamal Haasan not to contest Lok Sabha elections 2019 in Tamil Nadu

గత సంవత్సరం ప్రముఖ హీరో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించారు. తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ మీద పలు సందర్బాల్లో విమర్శలు చేసిన కమల్ హాసన్ లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉంటూ తన పార్టీ అభయర్థులు పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించారు.

ప్రధాని నరేంద్ర మోడీ మీద విమర్శలు చేస్తున్న కమల్ హాసన్ ఎలాంటి పరిస్థితుల్లో బీజేపీకి తన మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పారు. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ, ప్రతిపక్ష డీఎంకే పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా కమల్ హాసన్ ఒంటరిగా ఎన్నికల బరిలో తమ పార్టీ అభ్యర్థులను పోటీ చేయిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+