ఆటలొద్దు.. కమల్ హాసన్ సంచలన వార్నింగ్..
తమిళనాడులో మళ్లీ భాషా రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా జాతీయ విద్యా విధానం(NEP) దేశవ్యాప్తంగా అమలుపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో తమిళ ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించి 8 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చెన్నైలోని పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ మేరకు ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు.
"తమిళీయులు భాష కోసం ప్రాణాలు అర్పించారు. తమిళ భాషతో ఆటలు వద్దు. నేను రాజకీయాల్లోకి ఆలస్యంగా ప్రవేశించాను. అందుకే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంది. 20 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి ప్రవేశించి ఉంటే ఇప్పుడు నా స్థానం, లెవెల్ వేరేగా ఉండేది. తమిళనాడులో పిల్లలకు కూడా తెలుసు వాళ్లు ఏ భాష ఎంచుకోవాలో. వారికి ఆ పరిపక్వత ఉంది."అని కమల్ హాసన్ తెలిపారు.

ప్రత్యర్థులు తనను ఫెయిల్డ్ పొలిటిషియన్ అని అంటారు.. కానీ అవన్నీ తాను పట్టించుకోనున్నారు. ఈమేరకు 2026 అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ కార్యకర్తలు దృష్టి పెట్టాలన్నారు. తమ పార్టీ చిన్నదని.. ఈ సంవత్సరం తమ గొంతును పార్లమెంట్ లో వినిపిస్తామని అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీలో తమ గొంతును వినిపిస్తామన్నారు. 2026 ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.












Click it and Unblock the Notifications