రాక్షసత్వానికి పరాకాష్ట.. విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్​ పోశారు..

ఒడిశాలోని కందమాల్​ జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. కొందరు విద్యార్థులు చేసిన ఆకతాయి పనికి ​8 మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. హాస్టల్ లో నిద్రిస్తున్న 8 మంది విద్యార్థుల కళ్లలో తోటి విద్యార్థులే ఫెవిక్విక్ పోశారు. దీంతో విద్యార్థులు కళ్లు ఓపెన్ చేయలేక పోతున్నారు. విద్యార్థుల కేకలకు హాస్టల్ సిబ్బంది వీరిని సమీప ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం వీళ్లంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేశారు.

ఒడిశాలోని కందమాల్​ జిల్లాలో ఫిరింగియా బ్లాక్‌ లోని సలగూడా సెబాశ్రమ్ విద్యాలయంలో అమానవీయ ఘటన జరిగింది. కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉండాల్సిన విద్యార్థులే తోటి స్నేహితులపై దాడులకు పాల్పడుతున్నారు. హాస్టల్‌ లో రాత్రి నిద్రపోతున్న 8 మంది విద్యార్థుల కళ్లలో తోటి విద్యార్థులే ఫెవిక్విక్ పోశారు. దీంతో వారి భవితవ్యం అంధకారంలో పడింది. కళ్లు తెరవలేక తీవ్రంగా విలపిస్తున్న వారిని హాస్టల్ సిబ్బంది సమీప ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.

Kandhamal Horror Fevikwik Poured into Sleeping Students Eyes 8 Rushed to Hospital

మరోవైపు ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి సలగూడ సేవశ్రామం ప్రిన్సిపల్​, వార్డెన్ ను సస్పెండ్​ చేశారు. హాస్టల్​లో ప్రిన్సిపల్​ తో పాటుగా ఉపాధ్యాయులు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+