కంగారు కోర్టు శిక్ష: 12 మందితో రేప్ చేయించారు

 Kangaroo court punishes tribal girl with gang-rape in West Bengal
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూమ్ జిల్లాలో 20 ఏళ్ల యువతిపై 12 మందితో సామూహిక అత్యాచారం చేయించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడితో సంబంధం పెట్టుకుందనే ఆరోపణపై గ్రామ కంగారూ కోర్టు తీర్పు మేరకు ఆ యువతిపై 12 మంది సామూహిక అత్యాచారం జరిపారు.

పశ్చిమ బెంగాల్ రాజధానికి 150 కిలోమీటర్ల దూరంలో గల బిర్భూమి జిల్లాలోని సుబాల్పూర్ గ్రామంలో ఈ అత్యంత సిగ్గుచేటైన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పిటిఐ వార్తాకథనం ప్రకారం - అమ్మాయిని రెండు వేల రూపాయల జరిమానా విధించాలని గ్రామానికి చెందిన పెద్దల కోర్టు ఆదేశించింది.

ఆ మొత్తం చెల్లించలేమని కుటుంబం చెప్పడంతో ఆ యువతిపై సామూహిక అత్యాచారం చేయాలని గ్రామ పెద్ద ఆదేశించాడు. ఆ సంఘటనపై ఆ గిరిజన యువతి లాభ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను చికిత్స నిమిత్తం సూరిలోని ఆస్పత్రికి పంపించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

గ్రామానికి చెందిన 13 మందిపై యువతి ఫిర్యాదు చేసింది. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అసిస్టెంట్ పోలీసు సూపరింటిండెంట్ ప్రశాంత చౌదరి చెప్పారు.

ఇదే జిల్లాలో నాలుగేళ్ల క్రితం మరో సామాజిక వర్గానికి చెందిన యువకుడితో సంబంధం పెట్టుకుందనే ఆరోపణపై ఓ గిరిజన యువతిని నగ్నంగా ఊరేగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+