కన్హయ్య కుమార్ కాన్వాయ్ పైన బీహార్‌లో దాడి, పలువురికి గాయాలు
పాట్నా: జెఎన్యూ మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కాన్వాయ్ పైన మంగళవారం బీహార్‌లో దాడి జరిగింది. బెగుసరాయి జిల్లాలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని తెలుస్తోంది. ఈ దాడి నేపథ్యంలో కన్హయ్య కుమార్ మద్దతుదారులు ప్రతిదాడికి దిగారు.

ఓ ప్రాంతంలో కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో పలు విద్యార్థి సంఘాలు భేటీ అయ్యాయి. అనంతరం వారు ర్యాలీగా బయలుదేరారు. ఈ సమయంలో దాడి జరిగింది. కన్హయ్య మద్దతుదారులు, దాడికి దిగిన గ్రూపులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.
కన్హయ్య కుమార్ వచ్చే ఏడాది సిపిఐలో చేరి, బెగుసరాయ్ నుంచి లోకసభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే చర్చలు జరిగాయి.












Click it and Unblock the Notifications