Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

coronavirus: కనిక కపూర్ ఏజ్ 28 ఏళ్లు అట.. 13 ఏళ్లు తగ్గించిన అధికారులు, మేల్ అట..?

కనిక కపూర్‌కు కరోనా వైరస్ సోకిందనే అంశంపై వివాదం నెలకొంది. ఇటీవల లండన్ నుంచి కనిక కపూర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే పార్టీకి వెళ్లడంతో బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సహా ఇతర నేతలు సెల్ప్ క్వారంటైన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కనిక కపూర్‌ను వెనకొసుకొచ్చిన సోనమ్ కపూర్‌ను నెటిజన్లు ఏకీపారేశారు. దీంతో కనిక కపూర్ కుటుంబసభ్యులు స్పందించారు.

ఈ నెల 9వ తేదీన కనిక కపూర్ లండన్ నుంచి ముంబై వచ్చారని పేర్కొన్నారు. రెండురోజుల తర్వాత లక్నో వచ్చారని.. తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిందని బయటపడిందని అంగీకరించారు. కానీ కనిక కపూర్ నివేదికపైనే ఫ్యామిలీ మెంబర్స్ అనుమానం వ్యక్తం చేశారు. వైద్యులు చెబుతోన్న నివేదిక కనికదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ కుటుంబసభ్యుల సందేహానికి కూడా కారణం ఉంది.

Kanika Kapoor is male, 28 years old..report declared: family members

కనిక కపూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందనే రిపోర్టులో తప్పులతో వారికి అనుమానం వచ్చింది. కనిక కపూర్ రక్త నమూనాలను తీసుకున్న వైద్యులు... ఆమె వయస్సును తప్పుగా రాశారు. 41 ఏళ్లు ఉన్న ఆమె ఏజ్ కేవలం 28 ఏళ్లుగా చూపించారు. దీంతోపాటు ఆమె లింగాన్నే మార్చారు. ఫిమేల్ చూపించాల్సింది... మేల్ అని రాశారు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్.. నివేదిక ఎవరిదీ, కనికదేనా..? మరేవరిదైనా ఇచ్చారా అని అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల ఆరోపణలపై వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+