అర్దరాత్రి కన్నడ నటుడి రచ్చ, పోలీస్ స్టేషన్ కు పట్టుకుపోయి ఫైన్, నేను తప్పు చెయ్యలేదు !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: అర్దరాత్రి దాటిన తరువాత నడిరోడ్డులో హంగామా చేస్తున్నారని ఆరోపిస్తున్న ప్రముఖ కన్నడ నటుడిని బెంగళూరులోని మాగడి రోడ్డు పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అపరాద రుసుం విధించారు. ప్రముఖ కన్నడ నటుడు రాకేష్, అతని స్నేహితుడికి అపరాద రుసుం విధించామని పోలీసులు చెప్పారు.

అర్దరాత్రి దాటిన తరువాత బుధవారం వేకువ జామున 1.30 గంటల సమయంలో బెంగళూరు నగరంలోని గోపాలపుర సమీపంలోని రామమందిరం దగ్గర కొందరు యువకులు రోడ్డు మీద మద్యం సేవిస్తూ సిగరేట్లు తాగుతున్నారని పోలీసు హెల్ప్ లైన్ కు సమాచారం వెళ్లింది.

Kannada actor alleges torture: Bengaluru cops deny charge

వెంటనే మాగడి రోడ్డు పోలీసులు హోస్సళ వాహనంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ కన్నడ నటుడు రాకేష్ మరో ఆరు మంది సిగరేట్లు తాగుతున్నారని పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసిన వెంటనే కన్నడ నటుడు రాకేష్ స్నేహితులు పరారైనారు.

కన్నడ నటుడు రాకేష్ తో పాటు అతని స్నేహితుడు శ్రేయస్ ను పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. బహిరంగంగా నడి రోడ్డులో సిగరెట్లు తాగుతున్నారని రసీదు రాసిన పోలీసులు వారి దగ్గర రూ. 200 చొప్పున అపరాద రుసుం వసూలు చేసి విడిచి పెట్టారు.

గురువారం రాకేష్ తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ తాను నడిరోడ్డులో సిగరేట్లు తాగలేదని, స్నేహితులతో కలిసి మాట్లాడుతుంటే బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చి అపరాద రుసుం వసూలు చేశారని ఆరోపించాడు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని నటుడు రాకేష్ చెప్పాడు. రాకేష్ అనేక సినిమాల్లో హీరోగా నటించాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rakesh, a Kannada movie actor, on Wednesday alleged Magadi Road police tortured him. While Rakesh said police tortured him after picking him up fro m near Ramamandir in Gopalapura, for allegedly smoking in public, cops have denied the allegations.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి